News April 14, 2024

నేడు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

ఖమ్మం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిపై నేడు స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యమైంది. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరావును ప్రకటించగా.. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. ఓ వైపు వారు ప్రచారం చేసుకుంటుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీ కామెంట్.

Similar News

News November 25, 2024

ఖమ్మం జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కృషి : తుమ్మల

image

ఖమ్మం జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలో వన సమారాధన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటైతే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వినతి పత్రం సమర్పించినట్లు గుర్తు చేశారు.

News November 25, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

∆} భద్రాద్రి జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన ∆} మధిరలో ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} బూర్గంపాడులో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం  ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News November 25, 2024

ఖమ్మం: సర్వే డేటా ఎంట్రీ కీలకం: భట్టి

image

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకున్నదని, సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైందని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతెలిపారు. భట్టి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో 5,68,493 ఇండ్లను సర్వే కోసం గుర్తించామని, ఈనెల 23 నాటికి మొత్తం 4,78,868 ఇండ్ల సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ వివరించారు.