News April 14, 2024
థాంక్యూ మోదీ గారు: జగన్

రాయి దాడిలో గాయపడ్డ తాను త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు సీఎం జగన్ రిప్లై ఇచ్చారు. ‘థాంక్యూ మోదీ గారు’ అని జగన్ Xలో స్పందించారు. కాగా అర్ధరాత్రి గాయానికి ట్రీట్‌మెంట్ తర్వాత జగన్ కేసరపల్లికి వెళ్లారు. ఇవాళ అక్కడే రెస్ట్ తీసుకోనున్నారు.
Similar News
News March 15, 2026
ఇలా అయితే SRHకు ఇబ్బందులు తప్పవు: పుజారా

SRHలో అభిషేక్, హెడ్, క్లాసెన్ లాంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్నప్పటికీ అనేక లోపాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ పుజారా తెలిపారు. ‘ఆ ముగ్గురు ఔటవగానే జట్టును ముందుకు తీసుకెళ్లే ప్లేయర్ కనపడటం లేదు. దీన్ని ప్రత్యర్థి జట్లు అవకాశంగా మలుచుకుంటున్నాయి. అలాగే SRH హోంగ్రౌండులో మినహా మిగతా మైదానాల్లో ప్రదర్శన పేలవంగా ఉంది. ఈ అంశాలపై మేనేజ్‌మెంట్ దృష్టిసారించకపోతే ఇబ్బందులు తప్పవు’ అని పేర్కొన్నారు.
News March 15, 2026
జనగణనకు 76వేల మంది టీచర్లు

TG: మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే తొలిదశ <<19385989>>జనగణనకు<<>> 76వేల మంది టీచర్లను వినియోగించుకుంటామని సెన్సస్ డైరెక్టర్ భారతి చెప్పారు. పనితీరును పరిశీలించేందుకు ప్రతి 6-7 మంది ఎన్యూమరేటర్లకు ఓ సూపర్ వైజర్, రాష్ట్రవ్యాప్తంగా 762 మంది ఆఫీసర్లు ఉంటారని తెలిపారు. పౌరులే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేందుకు APR 26-మే 10 వరకు అవకాశం ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్/యాప్ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
News March 15, 2026
ఎగుమతులు బంద్.. పడిపోతున్న బియ్యం ధరలు

TG: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్ నుంచి బియ్యం ఎగుమతులు నిలిచిపోవడంతో రాష్ట్రంపై ప్రభావం పడుతోంది. క్రమంగా ధరలు పడిపోతున్నాయి. ఈ నెల 8న దొడ్డు ధాన్యం ధర క్వింటా ₹2,550 ఉండగా ప్రస్తుతం ₹2,450కి తగ్గింది. మరో ₹150 వరకు తగ్గే ఛాన్స్ ఉందని మిల్లర్లు చెబుతున్నారు. ఈ సీజన్‌లో మరో 145L టన్నుల బియ్యం మార్కెట్లోకి రానుందని, ఎక్స్‌పోర్ట్ ఆగిపోయినందున కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపరని పేర్కొంటున్నారు.


