News April 14, 2024

భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు: మోదీ

image

జమిలీ ఎన్నికలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ అన్నారు. దీంతో పాటు దేశం మొత్తం ఉమ్మడి పౌరస్మృతి(UCC)ని అమలు చేస్తామని చెప్పారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. తాము ప్రవేశపెట్టిన మేనిఫెస్టో బ్లూప్రింట్ వంటిదని తెలిపారు.

Similar News

News March 22, 2026

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం

image

TG: సిద్దిపేట పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా స్కీమ్ నిధులు విడుదల చేశారు. 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ₹3,600 కోట్లను బటన్ నొక్కి రిలీజ్ చేశారు. ఇవాళ బ్యాంకులకు సెలవు కావడంతో రేపు రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. 45 రోజుల్లో 3 విడతల్లో రూ.9వేల కోట్లు అకౌంట్లలో జమ చేయనున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.

News March 22, 2026

GK: ప్రపంచంలో అతి చిన్నవి

image

⋆ సముద్రం: ఆర్కిటిక్ (విస్తీర్ణం 14.05M చ.కి.మీ)
⋆ దేశం: వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ వైశాల్యం)
⋆ ఖండం: ఆస్ట్రేలియా (7.7-8.6M చ.కి.మీ వైశాల్యం)
⋆ పక్షి: బీ హమ్మింగ్‌బర్డ్ (5-6cm పొడవు, 2gms కంటే తక్కువ బరువు)
⋆ నది: US మాంటానాలో ఉన్న’రో’ నది (పొడవు 61m)
⋆ అతి చిన్న పుష్పం గల చెట్టు: ఉల్ఫియా ఆంగుస్టా

➜ రోజూ సా.5 గంటలకు GK బిట్స్

News March 22, 2026

గ్రీన్ ఎనర్జీలో ఏపీ నంబర్-1: సీఎం చంద్రబాబు

image

భవిష్యత్తులో అన్ని కంపెనీల డేటా సెంటర్లు భారత్‌కే వస్తాయని ఏపీ సీఎం చంద్రబాబు జోస్యం చెప్పారు. HYD ISBలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఏపీకి ఏఐ, క్వాంటం టెక్నాలజీ, డేటా సెంటర్లను తీసుకొచ్చాం. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాం. సోలార్, గ్రీన్, విండ్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో దక్షిణాదిలో మేమే నంబర్-1’ అని తెలిపారు.