News April 14, 2024

కడప: భర్తతో గొడవ పడి వివాహిత సూసైడ్

image

కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మృత్యుంజయకుంటలో నివాసం ఉంటున్న ఉదయగిరి కుల్లాయమ్మ అనే వివాహిత శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిఐ నరసింహారెడ్డి తెలిపారు. ఈనెల 12వ తేదీన రాత్రి ఆమె భర్త కుల్లాయప్ప ఆమెతో గొడవ పడి 11 నెలల కుమారుడిని తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోయాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Similar News

News March 6, 2026

కడప జిల్లాలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ వ్యాపారులు ఎంతమందంటే.!

image

కడప జీఎస్టీ డివిజన్లో 8 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 34,132 మంది జీఎస్టీ రిజిస్ట్రేషన్ వ్యాపారులు ఉన్నారు.
➤ కడప సర్కిల్-1లో 6031 మంది
➤ కడప సర్కిల్-2లో 4411
➤ ప్రొద్దుటూరు సర్కిల్-1లో 3450
➤ ప్రొద్దుటూరు సర్కిల్-2లో 4504
➤ పులివెందులో 2617
➤ రాయచోటిలో 5983
➤ మదనపల్లెలో 7032
➤ కడప స్పెషల్ సర్కిల్‌లో 99 జీఎస్టీ రిజిస్ట్రేషన్ దారులు ఉన్నారు.

News March 6, 2026

పులివెందుల సీఐగా శ్రీరామ్

image

గతంలో ప్రొద్దుటూరులో పనిచేసిన సీఐ శ్రీరామ్‌ను పులివెందుల సీఐగా బదిలీ చేస్తూ కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామిరెడ్డిని పులివెందుల టౌన్ నుంచి రూరల్‌కు, శాంతిలాల్‌ను కడప వీఆర్ నుంచి పులివెందుల ట్రాఫిక్‌కు బదిలీ చేశారు. శంకర్ రెడ్డిని కడప RSTF నుంచి RK వ్యాలీకి, ఉలసయ్యను RK వ్యాలీ నుంచి కడప వీఆర్‌కు, హాజీవల్లీని పులివెందుల ట్రాఫిక్ నుంచి నంద్యాల DPTCకి బదిలీ చేశారు.

News March 6, 2026

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌పై విచారణ.!

image

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ACB తనిఖీల్లో రవిచంద్రారెడ్డి నంద్యాల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో భవన నిర్మాణ అనుమతులు, అక్రమ భవనాలు క్రమబద్ధీకరణ, భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయడంలో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది.