News April 14, 2024
దాడి ఘటన.. సీన్ రీకన్‌స్ట్రక్షన్

నిన్న సీఎం జగన్‌పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. డ్రోన్లతో ఏరియల్ వ్యూ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అక్కడి CCTV ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాడికి ఎయిర్‌గన్ ఉపయోగించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ డీజీ.. జగన్ బస చేస్తున్న కేసరపల్లి క్యాంప్ వద్దకు వెళ్లి కలిశారు.
Similar News
News March 10, 2026
32,000 మంది అనర్హులకు PMKY నిధులు

PM కిసాన్ పథకం TGలో పక్కదారి పట్టింది. ఐటీ చెల్లింపుదారులు, భూమిని అమ్మేసిన వారు, ఇతర అనర్హులు ఇలా 32 వేలమంది లబ్ధి పొందినట్లు తేలింది. ఈ-కేవైసీలో ఆధార్ కార్డు లింక్ చేయడంతో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టిన వారు, అధిక భూమి ఉన్నవారు, కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికీ లబ్ధి కలిగినట్లు తేలింది. వీరికి PMKY నిలిపేశారు. పరిశీలన పూర్తయితే అనర్హులు ఇంకా తేలనున్నారు. ఈ స్కీములో ఏడాదికి ఎకరాకు ₹6వేలు ఇస్తున్నారు.
News March 10, 2026
ప్రభాస్ లేటెస్ట్ ఫొటో వైరల్

సినీ హీరో ప్రభాస్ లేటెస్ట్ ఫొటో SMలో వైరల్ అవుతోంది. ఆయనతో మలయాళం డైరెక్టర్ దిన్జిత్ అయ్యతాన్ దిగిన ఫొటో తాజాగా బయటికి వచ్చింది. ఇందులో ప్రభాస్ కొత్త హెయిర్ స్టైల్‌లో కనిపించారు. అటు ప్రభాస్‌తో మూవీ తీసేందుకు ఆసక్తి చూపుతున్న హోంబలే ఫిలిమ్స్ ఈ డైరెక్టర్ ద్వారా స్టోరీ వినిపించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన ఫౌజీ, కల్కి-2 మూవీల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
News March 10, 2026
భారత్‌లో టాప్ శాలరీ ₹8కోట్లు!

దేశంలో AI, సెమీకండక్టర్స్, EV, బ్యాటరీ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల ఉద్యోగులకు డిమాండ్ ఉందని ఇండియా శాలరీ గైడ్ 2026 వెల్లడించింది. స్కిల్‌ను బట్టి సంస్థలు 30% వరకు హైక్ ఇస్తున్నాయంది. టాప్ శాలరీల్లో ఫైనాన్స్ రంగం గరిష్ఠంగా ₹8Cr/yr ఆఫర్ చేస్తోంది. ప్రైవేట్ ఈక్విటీ, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లోనూ భారీ జీతాలు ఉన్నాయంది. CEO స్థాయి వారికి శాలరీతో పాటు బోనస్/షేర్లతో అదనపు ఆదాయం ఉంటుంది.


