News April 14, 2024

చంద్రబాబు, లోకేశ్‌ ప్రోద్బలంతోనే సీఎంపై దాడి: విరుపాక్షి

image

చంద్రబాబు, లోకేశ్‌ ప్రోద్బలంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి ఆరోపించారు. ఆదివారం ఆలూరులో అయన విలేకర్లతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడం దారుణమని, ప్రతిపక్ష నాయకులు ఓటమి భయాన్ని తట్టుకోలేక దాడులకు పాల్పడ్డారని అన్నారు. మరొకసారి వైసీపీకి ప్రజలు అధికారం కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News March 20, 2026

కర్నూలు జిల్లాలో వడగండ్ల వానలపై సీఎం సమీక్ష

image

కర్నూలు జిల్లాల్లో వంటగ్యాస్ అందుబాటు, అకాల వర్షాల పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డా. ఏ.సిరి జిల్లాలో గ్యాస్ సరఫరా సమృద్ధిగా ఉందని తెలిపారు. పత్తికొండ, హాలహార్వి, మద్దికేర, తుగ్గలి మండలాల్లో వడగండ్ల వానలు కురిసిన విషయాన్ని వివరించారు. ప్రభావిత రైతులకు సహాయం అందించాలని సీఎం ఆదేశించారు.

News March 20, 2026

ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి: మంత్రి

image

ప్ర‌భుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా వివ‌రించాల్సిన బాధ్య‌త కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌పై ఉంద‌ని మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. శుక్రవారం కర్నూలు న‌గ‌రంలోని ఆయ‌న కార్యాల‌యంలో క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌ వేసి నివాళుల‌ర్పించారు. ప్ర‌తి వార్డులో అభివృద్ధి ప‌నులు చేపడుతున్న‌ట్లు తెలిపారు.

News March 20, 2026

నగరాభివృద్ధికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

కర్నూలు నగరాభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. శుక్రవారం వెంకటరమణ కాలనీలోని నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆమె తన ఛాంబర్‌ను ప్రారంభించారు. కమిషనర్ పి.విశ్వనాథ్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నగర పరిపాలనలో సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం తన కార్యాలయంలో కేఎంసి పూర్తి మ్యాప్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.