News April 14, 2024
విశాఖ: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి సభ

అచ్యుతాపురంలో ఈనెల 16న వారాహి విజయభేరి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, టీడీపీ ఇన్‌ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు తెలిపారు. ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈమేరకు సభా స్థలాన్ని పరిశీలించారు. కాగా.. అదేరోజు చోడవరం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.
Similar News
News March 10, 2026
విశాఖ రుషికొండలో ‘క్రౌన్ ప్లాజా’ హోటల్

విశాఖపట్నం రుషికొండలో ‘కోస్టల్ హాస్పిటాలిటీ ప్రిసింక్ట్’ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని ‘క్రౌన్ ప్లాజా’ బ్రాండ్‌తో కె.పి.సి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మించనుంది. సుమారు ₹280.51 కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్ట్ ద్వారా 310 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. పర్యాటక పాలసీ 2024-29లో భాగంగా ప్రభుత్వం భూమిని, ప్రోత్సాహకాలను కేటాయించింది.
News March 10, 2026
పోర్టు రైల్వే ఎంట్రన్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

పోర్టులోకి వచ్చే రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు హార్బర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. గూడ్స్ రైలు పోర్ట్‌లోకి వస్తుండగా ఒక్కసారిగా శబ్దంతో కరెంటు పోవడం ఎలక్ట్రికల్ రైలు ఆగిపోవడం గుర్తించిన అప్పారావు అనే వ్యక్తి ఏం జరిగిందని పరిశీలించగా పోల్ పక్కన పడిపోయిన వ్యక్తిని గమనించాడు. వ్యక్తి వివరాలు తెలియకపోవడంతో హార్బర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News March 10, 2026
విశాఖలో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై కేసులు

విశాఖలో 10 రోజులుగా రవాణా శాఖ అధికారులు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై 8 కేసులు నమోదు చేసినట్టు ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించి అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం వంటివి గుర్తించారు. నిబంధనలు ఉల్లంగించిన 8 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.6,35,000 చలానా విధించారు.


