News April 14, 2024
ఇరాన్-ఇజ్రాయెల్ బలాబలాలు ఇవే
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఇరాన్‌కు 6.1 లక్షలు, ఇజ్రాయెల్‌కు 1.7 లక్షల సైన్యం ఉంది. ఇరాన్‌కు 551, ఇజ్రాయెల్‌కు 612 యుద్ధవిమానాలు ఉన్నాయి. ఇరాన్‌కు 186, ఇజ్రాయెల్‌కు 241 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఇరాన్‌కు 13, ఇజ్రాయెల్‌కు 48 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇరాన్‌కు 1996, ఇజ్రాయెల్‌కు 1,370 యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి. ఇరాన్‌కు 19, ఇజ్రాయెల్‌కు 5 సబ్‌మెరైన్లు ఉన్నాయి.
Similar News
News November 17, 2024
కులం పేరుతో విభజించాలని కాంగ్రెస్ చూస్తోంది: పవన్
దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురాగలిగే సత్తా పీఎం మోదీకి మాత్రమే ఉందని AP Dy.CM పవన్ అన్నారు. మహారాష్ట్రలోని భోకర్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘హిందు, ముస్లిం, క్రిస్టియన్ అనే భేద భావం మన దేశంలో లేదు. అమీర్, సల్మాన్, షారుఖ్ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్లుగా ఉన్నారు. అబ్దుల్ కలామ్‌ను గుండెల్లో పెట్టుకున్న దేశం మనది. ప్రజలను కులం, రిజర్వేషన్ల పేరుతో విడగొట్టాలని కాంగ్రెస్ చూస్తోంది’ అని ఆరోపించారు.
News November 17, 2024
BGT: తొలి టెస్టుకు తుది జట్టు ఇదేనా?
BGTలో తొలి టెస్టు ఆరంభానికి మరో 5 రోజులు ఉంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగడం లేదని తెలుస్తోంది. వీరి స్థానంలో సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ జట్టులో చోటు దక్కించుకుంటారని టాక్. జైస్వాల్‌తో కలిసి సుదర్శన్ ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ ఉంది. ప్రాబబుల్ జట్టు: జైస్వాల్, సుదర్శన్, కోహ్లీ, రాహుల్, పంత్, జురెల్/నితీశ్, అశ్విన్, జడేజా, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్
News November 17, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.