News April 14, 2024

సిద్దిపేట: దేశ సేవలో ఆ గ్రామ యువకులు

image

యాభై కుటుంబాలతో చూడటానికి చిన్న గ్రామమైనా.. ఆదర్శంలో మాత్రం పెద్దది. దేశ సేవకోసం మేము సైతం అంటూ ఆ గ్రామ యువత కదిలారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 25మందికిపైగా సైన్యంలో చేరి దేశ రక్షణలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. మర్కూక్‌ మండలం గంగాపూర్‌కు రాజస్థాన్‌, హర్యానా రాష్ట్రాల నుంచి ఎన్నో ఏళ్ల కిందట వచ్చిన ‘రాజ్‌పుత్‌’లతో గంగాపూర్‌గా ఆవిర్భవించింది. చాలా ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు.

Similar News

News March 10, 2026

అవయవ మార్పిడి పాలసీపై మంత్రి సమీక్ష

image

ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో అవయవ మార్పిడి చట్టం(THOTA) పాలసీ రూపకల్పన, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలుపై మంత్రి దామోదర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవయవ దానాలను ప్రోత్సహించే విధంగా విధానాలను సరళీకృతం చేయాలని, చికిత్స ఖర్చులు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరల నియంత్రణ చేపట్టాలని సూచించారు. అవయవ మార్పిడి చికిత్సలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి తెలిపారు.

News March 10, 2026

‘మినిట్ టు మినిట్’ ప్రణాళికను సిద్ధం చేయాలి: కలెక్టర్

image

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 12న ప్రజాప్రతినిధులకు నిర్వహించనున్న శిక్షణపై కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులతో సమీక్షించారు. సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె మాట్లాడుతూ.. శిక్షణకు సంబంధించి ‘మినిట్ టు మినిట్’ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లకు అవగాహన కల్పించాలని, పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

News March 10, 2026

భూ హక్కుల కోసమే రీ-సర్వే: అదనపు కలెక్టర్

image

భూములపై పక్కా హక్కులు కల్పించేందుకే రీ-సర్వే చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం రామాయంపేట మండలం అక్కన్నపేటలో నిర్వహించిన ‘భూభారతి’ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. 100 ఏళ్ల క్రితం నిజాం కాలంలో రూపొందించిన నక్షల్లో ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సరిచేయడమే ఈ సర్వే లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.