News April 14, 2024
రాఘవా లారెన్స్ హీరోగా ‘BENZ’ మూవీ

స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తన తదుపరి చిత్రంపై అప్‌డేట్ ఇచ్చారు. ఈసారి నిర్మాతగా వ్యవహరించనున్న అతడు రాఘవా లారెన్స్ హీరోగా ‘BENZ’ అనే మూవీని నిర్మిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ సినిమాను బక్యరాజ్ కన్నన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి లోకేశ్ కనగరాజ్ కథను అందిస్తుండటం విశేషం. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
Similar News
News March 20, 2026
కాంగ్రెస్‌ది చోర్ విధానం: హరీశ్ రావు

TG: కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయం, GSDP తగ్గిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘కాంగ్రెస్‌ది క్యూర్, ప్యూర్, రేర్ విధానం కాదు.. చోర్ విధానం. 6 గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. BRS హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 12.1% ఉంటే ఇప్పుడు 10.2%గా ఉంది. కాంగ్రెస్ వైఫల్యం వల్లే ఇది తగ్గింది. బడ్జెట్ ద్వారా ఈ ప్రభుత్వ చేతగానితనం అర్థమైంది’ అని ప్రెస్‌మీట్‌లో ఫైరయ్యారు.
News March 20, 2026
అంతరిక్షంలో 129 ఇస్రో వ్యర్థాలు: కేంద్రం

ఇస్రో ప్రయోగించిన రాకెట్ల శకలాలు, ఫెయిలైన శాటిలైట్లు అంతరిక్షంలో 129 ఉన్నాయని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. వీటిలో 49 ఉపయోగం లేని ఉపగ్రహాలు ఉన్నాయని తెలిపింది. అందులో భూమికి సమీప కక్ష్య(LEO)లో 23, భూస్థిర కక్ష్య(GEO)లో 26 ఉన్నాయంది. మిగిలినవాటిలో PSLV శకలాలు 40, GSLV 4, LVM3 వ్యర్థాలు 3, PSLV-C3 రాకెట్ భాగం విచ్ఛిన్నం కావడంతో ఏర్పడిన 33 శకలాలు కూడా ఉన్నాయని పేర్కొంది.