News April 14, 2024
సీఎం జగన్‌పై దాడి ఘటన.. ECI ఆరా

AP: సీఎం జగన్‌పై రాయితో జరిగిన దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభ, సీఎం రోడ్‌షోలో భద్రతా వైఫల్యంపై ప్రశ్నించింది. రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.
Similar News
News March 11, 2026
అంగీకారంతో జరిగితే దాన్ని రేప్ అనలేం: కర్ణాటక హైకోర్టు

అంగీకారంతో కొన్నేళ్లపాటు రిలేషన్‌షిప్‌లో ఉండి ఆపై పెళ్లికి నిరాకరిస్తే రేప్‌గా పరిగణించలేమని కర్ణాటక HC స్పష్టం చేసింది. ‘‘చట్టం ప్రకారం ‘హార్ట్‌బ్రేక్’ నేరం కాదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. పైగా విదేశాల్లో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే అది మోసం కిందకు రాదంటూ నిందితుడిపై కేసును కొట్టివేసింది. కేవలం పెళ్లి చేసుకోలేదన్న కారణంతో అంగీకారంతో కూడిన బంధాన్ని రేప్‌గా మార్చలేమని కోర్టు తేల్చిచెప్పింది.
News March 11, 2026
పొద చిక్కుడులో కాయతొలిచే పురుగు నివారణ

పొద చిక్కుడు పూత, కాయ దశల్లో కాయతొలిచే పురుగు ఆశించి కాయలోని పదార్థాలను తినేస్తుంది. దీని వల్ల కాయ నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది. కాయతొలిచే పురుగు నివారణకు ఫ్లూబెండమైడ్ 39.35% ఎస్.సి. 60 మి.లీ. లేదా క్లోరంత్రానిలిప్రోల్ 18.5% ఎస్.సి. 60 మి.లీ. లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 60 మి.లీ.తో పాటు జిగురు 100 మి.లీ. కలిపి ఎకరానికి సరిపడా 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
News March 11, 2026
పొట్టను దాస్తూ అలసిపోయా.. తగ్గి చూపిస్తా: KTR

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఫొటోను Xలో షేర్ చేశారు. తన పొట్టను దాస్తూ అలసిపోయానని, 6 నెలల విరామం తర్వాత మళ్లీ జిమ్‌లో కసరత్తు మొదలుపెట్టానని ఆయన రాసుకొచ్చారు. జులైలో తనకు 50 ఏళ్లు రానున్నాయని, ఆ నాటికి స్లిమ్‌గా మారతానంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా విజయ్ దేవరకొండ రిసెప్షన్‌లో కేటీఆర్ తన పొట్టను దాస్తూ సరదాగా కామెంట్ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.


