News April 14, 2024
HYD: EMERGENCY పంపింగ్‌కు చర్యలు

HYDలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ తెలిపారు. నాగార్జున సాగర్‌లో ఈనెల 15 నుంచి ఎమెర్జెన్సీ పంపింగ్‌కు ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించారు. నీటి సరఫరాలో ఆటంకం కలిగించే లైన్ మెన్లపై చర్యలు తీసుకుంటామన్నారు. జంట జలాశయాల నుంచి అదనంగా 20 ఎంఎల్డీల నీటిని వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నీటి నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు.
Similar News
News March 4, 2026
HYD: మెట్రో హంగులకు ఇక గుడ్-బై!

L&T చేతిలో ఉన్న HYD మెట్రో ఫేజ్-1 ఇక పక్కా ప్రభుత్వ ఆస్తి కాబోతోంది. MAR 31 నాటికి అప్పగింత పూర్తి కావాల్సిందేనని CS నుంచి డెడ్ లైన్ వచ్చింది. సుమారు రూ.15,000 కోట్ల భారీ డీల్ ఇది. ఈ డబ్బు కోసం ప్రభుత్వం ఇప్పుడు IRFC దగ్గర తక్కువ వడ్డీకి అప్పు కోసం తిరుగుతోంది. ప్రభుత్వ మెట్రోలో సామాన్యుడికి టికెట్ ధరలు తగ్గుతాయా?, కనీస మెయింటెనెన్స్ లేక మెట్రో ‘ఆర్టీసీ’లా మారుతుందా? అని జనం టెన్షన్ పడుతున్నారు.
News March 4, 2026
3 ముక్కల HYD.. ‘గ్రేటర్’ కథ కంచికే!

FEB 10తో GHMC కౌన్సిల్ పదవీకాలం ముగియడమే ఆలస్యం.. సర్కారు సిటీని 3 ముక్కలు చేస్తూ GO నం. 55 ఇచ్చేసింది. ఈ ముక్కలాట వెనుక అసలు కిటుకు వార్డుల పునర్విభజన. పాతబస్తీ పట్టు తగ్గించి కొత్త ఏరియాల్లో పొలిటికల్ పవర్ మార్చడమే అసలు ప్లాన్ అని విశ్లేషకులు అంటున్నారు. ఏటా రూ.2,000 కోట్ల ట్యాక్స్ కట్టే IT ఏరియా CYB కిందకి వెళ్లడంతో GHMC డెవలప్‌మెంట్ కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారో? అన్నది సవాల్‌గా మారింది.
News March 4, 2026
ఇరాన్‌తో HYDకు స్పెషల్ ATTACHMENT..!

ఇరాన్‌తో HYDకు విడదీయరాని అనుబంధం ఉంది. బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం, జామున్, జిలేబీ, సమోసా ఇరానీలు పరిచయం చేసినవే. గోల్కొండ, చార్మినార్ చారిత్రక కట్టడాల్లోనూ పర్షియన్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇక్కడి తెలుగు, ఉర్దూ భాషలపైనా ఇరాన్ పదాల ప్రభావం ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ పేరుతో బంజారాహిల్స్‌లో కాన్సులేట్, రోడ్డు, పాతబస్తీలో ఇరానీ గల్లీ కూడా ఉందంటే ఇరాన్‌తో HYDకున్న రిలేషన్‌ను అర్థం చేసుకోవచ్చు.


