News April 14, 2024
విశాఖ: ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు బ్యానర్లు

పరవాడ మండలం మూల స్వయంభువరం గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గ్రామంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ నుంచి వచ్చే దుమ్ము, ధూళి, ఉప్పునీటి తుంపర్లు కారణంగా అనారోగ్యం పాలవుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వీటినుంచి తమను రక్షించే వరకు తాము అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
Similar News
News March 8, 2026
విశాఖలో చేయి తడిపితేనే.. కొళాయి కనెక్షన్

విశాఖలోని నీటి కొళాయి కనెక్షన్ కోసం జీవీఎంసీకి దరఖాస్తు చేసి, ఫీజులు చెల్లించినా మంజూరులో జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రూప్ హౌస్‌లు, అపార్ట్‌మెంట్‌ల బల్క్ వాటర్ కనెక్షన్ల విషయంలో కింది స్థాయి సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకుంటే ఫైళ్లు పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మీ పరిధిలో ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ చేయండి.
News March 7, 2026
విశాఖ: పన్నులు చెల్లించకుంటే జప్తే

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా జీవీఎంసీ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. రూ.650 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు మొండి బకాయిదారులపై చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 1,36,149 మంది బకాయిదారులను గుర్తించి, 1,10,136 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నీటి పన్ను చెల్లించని 62,290 మందికి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రూ.458.9 కోట్లు వసూలు కాగా, రూ.188.20 కోట్లు రావాల్సి ఉంది.