News April 14, 2024
ప్రజాదరణ చూసి ఓర్వలేక దాడి: జడ్పీ ఛైర్మన్

విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనపై జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు స్పందించారు. మళ్లీ జగన్ సీఎం కాబోతున్నారని, సిద్ధం సభకు వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. రాజ్యాంగ బద్ధంగా అధికారంలోకి రావాలే కానీ.. జగన్‌ను భౌతికంగా దూరం చేసి అధికారంలోకి రావాలన్న ఆలోచన మంచి విధానం కాదన్నారు. మరో 30 ఏళ్లు జగన్ ప్రజల గుండెల్లో ఉంటారన్నారు.
Similar News
News March 28, 2026
జిల్లా యువత వీటికి దూరంగా ఉండండి: ఎస్పీ

ఐపీఎల్ సీజన్ నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా యువత ఆన్‌లైన్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్‌రావు సూచించారు. బెట్టింగ్ యాప్‌లు అప్పులపాలు చేసి ప్రాణాలు తీసుకునే పరిస్థితులు కల్పిస్తాయని, వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. ఎక్కడైనా బెట్టింగ్ నిర్వహిస్తే 100కు ఫోన్ చేయాలని కోరారు. బెట్టింగులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News March 27, 2026
VZM: అనారోగ్యంతో టీడీపీ సీనియర్ నాయకుడు మృతి

తెలుగుదేశం సీనియర్ నాయకుడు తిక్కాన చినదేముడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి ఎస్.కోట నియోజకవర్గంలో వెన్నెముకగా ఉండి సర్పంచిగా, వైస్ ఎంపీపీగా, విశాఖ పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షుడు, ఉత్తమ రైతుగా పనిచేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. చినదేవుడు మృతి టీడీపీకి తీరనిలోటని ఎమ్మెల్యే లలిత కుమారి అన్నారు.