News April 14, 2024
కార్వేటినగరం: SI వాహనం డ్రైవర్ ఆత్మహత్య

చిత్తూరు జిల్లా కార్వేటినగరం ఎస్ఐ డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. పాదిరికుప్పం గ్రామానికి చెందిన సందీప్(21) ఎస్ఐ పోలీసు వాహనానికి తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సందీప్ తన కుటుంబ కలహాల కారణంగా పద్మసరస్సు గ్రామం సమీపంలోని మామిడి తోటలో ఉరివేసుకున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నాడు.
Similar News
News March 21, 2026
చిత్తూరు: ఐదుగురు DTలకు విధులు

గ్రూప్-2 పరీక్షల్లో DTలుగా ఎంపికైన వారిలో 16 మందిని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కేటాయించారు. చిత్తూరు జిల్లాకు 5 మందిని కేటాయించగా వారిలో.. శివకుమార్, మదన్ మోహన్ రెడ్డి, యస్థాని బాషా, సుధాకర్, శశికిరణ్ ఉన్నారు. వీరు ఏడాది పాటు రెవెన్యూ విభాగంలో ప్రొబేషన్ కింద జిల్లాలో విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
News March 20, 2026
చిత్తూరు: మూతపడుతున్న పెట్రోల్ బంకులు

బంకులకు పెట్రోల్ సరఫరా తగ్గడంతో స్టాక్ లేక పలు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండగా స్టాక్ త్వరగా అయిపోతుంది. అయితే ఇందన సరఫరా ఆలస్యం అవుతుండడంతో స్టాక్ లేక పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. హైవేపై ఉన్న బంకుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
News March 20, 2026
బంగారుపాళ్యం: హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన బంగారుపాళ్యంలో జరిగింది. పాపానివారి పల్లె కోళ్ల ఫారంలో బిహార్‌కు చెందిన లితీశ్ కుమార్ పనిచేస్తున్నాడు. కోళ్ల ఫారం యజమాని ప్రభుతో కలిసి బైకుపై కేజీ సత్రానికి బయలుదేరారు. వీరి వాహనాన్ని మరో బైక్ ఢీకొనడంతో లితీశ్ కుమార్ జాతీయ రహదారిపై పడ్డాడు. అటువైపు వెళుతున్న ట్యాంకర్ అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.


