News April 14, 2024

నేను బాగానే ఉన్నా.. ఆందోళన వద్దు: షిండే

image

తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని నటుడు షాయాజీ షిండే ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆయన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గుండెలో సమస్య ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని, అభిమానులు ఆందోళన చెందవద్దని షిండే కోరారు. మహారాష్ట్రకు చెందిన ఆయన, తెలుగులో పలు సినిమాలు చేసి పేరు తెచ్చుకున్నారు.

Similar News

News March 4, 2026

దుబాయ్, ఖతర్‌లో అమెరికా లక్ష్యాలపై ఇరాన్ దాడులు

image

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. దుబాయ్‌లోని US కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మరోవైపు ఖతర్‌లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం అల్ ఉదైద్ లక్ష్యంగా ఇరాన్ 2 బాలిస్టిక్ మిస్సైల్స్‌ను ప్రయోగించింది. వీటిలో ఒకదాన్ని డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకోగా రెండో క్షిపణి ఎయిర్ బేస్‌ను తాకింది. ఈ ఘటనల్లో ఆస్తి నష్టం సంభవించినా ప్రాణనష్టం జరగలేదు.

News March 4, 2026

రేపు టెన్త్ హాల్ టికెట్లు విడుదల

image

ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి <>వెబ్‌సైట్‌లో<<>> విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్‌లోనూ ఈ అవకాశం ఉంటుంది. నామినల్ రోల్స్‌లో విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో దొర్లిన తప్పులను సరిదిద్దుకోవడానికి FEB 26-28 మధ్య అవకాశం ఇచ్చారు. కాగా ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.

News March 4, 2026

ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు?

image

జూన్ తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుత పాలకవర్గాల గడువు ఏప్రిల్ 2తో ముగియనుండగా ప్రత్యేక పాలన విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏకసభ్య కమిషన్ నివేదిక, BC రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభానికి 3నెలలు పట్టే అవకాశం ఉంది. కమిషన్ నివేదిక ఆలస్యమైనా, రిజర్వేషన్ల అంశం కోర్టుకెక్కినా పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం కావచ్చు. అటు పరిషత్ ఎన్నికల తర్వాతే ‘పంచాయతీ’ నిర్వహించాలనే వాదనా ఉంది.