News April 14, 2024

ప్రకాశం: బాబోయ్.. మండిపోతున్న ఎండలు

image

ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రతిరోజు 38 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇళ్లకే పరిమితమైపోతున్నారు. ఒకవైపు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తుంటే మరి వైపు భానుడు తన ప్రతాపాన్ని చాటుతున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కుపోతకు గురవడంతో పాటు వృద్ధులు, చిన్న పిల్లలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.

Similar News

News March 21, 2026

BREAKING: మార్కాపురం జిల్లాలో MRO సస్పెండ్

image

మార్కాపురం జిల్లా పెద్దారవీడు MRO దిలీప్ కుమార్, దేవరాజుగట్టు VOR విజయభాస్కర్‌ రెడ్డిలను సస్పెండ్ చేసినట్లు మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ రాజబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భూముల వ్యవహారంలో తహశీల్దార్ దిలీప్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని, 25కి పైగా మ్యుటేషన్‌లు నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్ చేశారని వివరించారు. భూ అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 21, 2026

మార్కాపురం కలెక్టర్‌గా విజయ సునీత

image

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం.విజయ సునీత నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి మహిళా కలెక్టర్‌గా ఆమె ఈ ఘనత సాధించనున్నారు.

News March 20, 2026

ప్రకాశం జిల్లాలో పెట్రోల్ ధరల పెంపు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాపై యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పవర్ పెట్రోల్ ధరల పెంపుతో మరో షాక్ తగిలింది. గిద్దలూరులోని అన్ని బంకుల్లో పెట్రోల్ లీటర్‌పై రూ.2.35 పెంచి రూ.119.59 చొప్పున విక్రయిస్తున్నారు. సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.