News April 14, 2024
నివాళి: జార్జ్ రెడ్డి హత్యకు నేటికి 52 ఏళ్లు

‘జీనా హై తో మర్నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో ’ అంటూ నినాదించిన జార్జ్ రెడ్డి దేశవ్యాప్తంగా సుపరిచితుడు. మన HYDతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 1962లో జార్జ్ ఫ్యామిలీ నగరంలో స్థిరపడింది. నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన జార్జ్.. OUలో పీజీ చేశారు. యూనివర్సిటీలోనే PDS (PDSU)ను స్థాపించి ఉద్యమాలు నడిపారు. గిట్టనివారు 1972-APR-14న ఉస్మానియా యూనివర్సిటీలోనే దారుణంగా హత్యచేశారు. నేడు జార్జ్ 52వ వర్ధంతి.
Similar News
News January 12, 2026
HYD: నీటితో ఆటలాడితే.. నల్లా కనెక్షన్ కట్

మహానగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి చర్యలకు సిద్ధమైంది. వాహనాల వాషింగ్, గార్డెనింగ్, రోడ్లపై నీటిని వృథా చేస్తే రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించనుంది. 2సార్లు అవకాశం ఇచ్చి, ఆపై నల్లా కనెక్షన్ కట్ చేస్తారు. నీటి వృథాపై ఫొటో, లొకేషన్‌తో ‘పానీ యాప్’లో సమాచారం పంపేందుకు 10 వేల మంది వాటర్ వాలంటీర్లను రంగంలోకి దింపనున్నారు. 15 రోజుల్లో యాప్ అందుబాటులోకి రానుంది.
News January 12, 2026
FLASH: బోరబండలో యువతి మర్డర్

బోరబండలో ఓ ఉన్మాది యువతిని పొట్టనబెట్టుకున్నాడు. తనతో సరిగ్గా మాట్లాడటం లేదని అక్కసుతో యువతిని అతడు దారుణంగా హత్య చేశాడు. గతంలో ఇద్దరికీ బంజారాహిల్స్‌లోని ఒక పబ్‌లో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువతి ఇటీవల ఊర్వశీ బార్‌కు షిఫ్ట్ కావడంతో మాట్లాడటం తగ్గిందని భావించిన నిందితుడు నిన్న మాట్లాడదామని పిలిచి హత్య చేసినట్లు సమాచారం. నిందితుడు ప్రస్తుతం బోరబండ పోలీసుల అదుపులో ఉన్నాడు.
News January 11, 2026
HYD: చైనా మాంజాతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చెయ్యి కట్!

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగిలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు బైక్‌పై చైతన్య (27) వెళ్తున్నాడు. బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పైకి రాగానే చైతన్య చేయికి గాలి పటం మాంజా తగిలింది. దీంతో మాంజా చెయ్యికి చుట్టుకోవడంతో చైతన్య చెయ్యి తెగింది. తీవ్ర గాయాలు అయిన చైతన్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.


