News April 14, 2024

జగన్‌పై దాడి ఘటన.. నిఘా విభాగం కీలక సూచనలు

image

AP: CM జగన్‌పై నిన్న రాయితో దాడి ఘటన నేపథ్యంలో నిఘా విభాగం అప్రమత్తమైంది. ఇటీవల గుత్తిలో CM కాన్వాయ్‌పైకి చెప్పులు విసిరిన ఘటన దృష్ట్యా జగన్ బస్సు పరిసరాల్లోకి అనుమతిపై ఆంక్షలు విధించనున్నారు. జగన్, జనానికి మధ్య బారికేడ్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. అలాగే క్రేన్లు, భారీ గజమాలలు వద్దని.. వీలైనంత వరకు బస్సులోనే ఉండి రోడ్‌షో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అటు సభల్లో ర్యాంప్ వాక్ వద్దని కోరారు.

Similar News

News November 17, 2024

రాష్ట్ర పండుగగా కనకదాసు జయంతి

image

AP: తన కీర్తనల ద్వారా సమాజంలోని అసమానతల్ని రూపుమాపేందుకు కృషి చేసిన కనకదాసు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రేపు ఆయన 537వ జయంతి నిర్వహణకు ఉత్తర్వులిచ్చింది. రాష్ట స్థాయిలో అనంతపురంలో, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లోనూ ఘనంగా వేడుక నిర్వహించాలని ఆదేశించింది. ఈయన కన్నడలో నలచరిత్ర, హరిభక్తిసార, నృసింహస్తవ, రామధ్యాన చరిత్రే, మోహన తరంగిణి అనే రచనలు చేశారు.

News November 17, 2024

ఈనెల 20న వేములవాడకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 20న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం రాజన్న ఆలయ గుడి చెరువు మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వేములవాడ ఆలయం, జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం పర్యటన ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కాగా ఎల్లుండి వరంగల్‌లో సీఎం పర్యటించనున్నారు.

News November 17, 2024

ఆ రెండింటికి తేడా తెలియకుండానే ఐదేళ్లు పాలించారు: హోంమంత్రి

image

AP: YCP హయాంలో మహిళల అక్రమ రవాణా జరగలేదని <<14629630>>రోజా చేసిన ట్వీట్‌పై<<>> హోంమంత్రి అనిత స్పందించారు. ‘వ్యక్తిగత, మానసిక కారణాలతో కనపడకుండా పోతే అది మిస్సింగ్. ఉచ్చువేసి క్రయవిక్రయాలు జరిపి కనిపించకుండా మాయం చేస్తే అది హ్యుమన్ ట్రాఫికింగ్. ఈ రెండింటికి తేడా తెలియకుండానే గత ఐదేళ్లు పాలించారు. అవినీతి తప్ప ప్రజాక్షేమం ఏమాత్రం పట్టని ఇలాంటి వారు పరిపాలించడం ప్రజల పాలిట దౌర్భాగ్యం’ అని ట్వీట్ చేశారు.