News April 14, 2024
చిత్తూరు: ప్రభుత్వ విద్యార్థులు 68% మంది ఫెయిల్

చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 68 శాతం మంది ఫెయిల్ అయ్యారు. 2,581 మంది పరీక్షలు రాయగా 806(32 శాతం) మందే పాసయ్యారు. ఇందులో అబ్బాయిలు 272 మంది, అమ్మాయిలు 534 మంది ఉన్నారు. రెండో సంవత్సరంలో 2240 మందికి 1083 మందే పాసయ్యారు. ఇందులో అబ్బాయిలు 456, అమ్మాయిలు 627 మంది ఉన్నారు. ఓవరాల్‌గా ఇంటర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది.
Similar News
News March 12, 2026
చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది కష్టమే.!

ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉండనుందని AACPC ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ టి.ప్రతిమ తెలిపారు. వేడి గాలులతో పాటు తేమ శాతం తగ్గడంతో ఉక్కపోతతోపాటు, గతేడాది కన్నా 1.5 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రైతులు తేమ శాతం అందించే పంటలతో పాటు వేడిని తట్టుకోగల పంటలు వేసుకోవాలని Way2News ద్వారా ఆమె సూచించారు. మీ ప్రాంతంలో ఎండలు పెరిగాయా?
News March 12, 2026
చిత్తూరు: వంట గ్యాస్ కోసం పరుగులు.!

రొంపిచర్ల మండలంలో వంట గ్యాస్ కోసం వినియోగదారులు గోడౌన్ వద్దకు పరుగులు తీస్తున్నారు. రెండు రోజులుగా వినియోగదారులతో గ్యాస్ ఆఫీస్ కిటకిటలాడుతోంది. యుద్ధం కారణంగా గ్యాస్ దొరకదేమో అని జాగ్రత్తలు పడుతున్నారు. రంజాన్, ఉగాది పండుగలు వస్తుండటంతో వంటగ్యాస్ కోసం ఆరాటపడుతున్నారు. బుక్ చేసి OTP చెప్పినవారికే గ్యాస్ ఇస్తున్నారు. మరి కొంత మంది నెట్వర్క్ పనిచేయక నిరాశ చెంది వెనుతిరుగుతున్నారు.
News March 11, 2026
చిత్తూరులో 13న ముస్లింలకు ఇఫ్తార్ విందు

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు “ఇఫ్తార్ విందు” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి చిన్నారెడ్డి పేర్కొన్నారు. 13వ తేదీ శుక్రవారం 5:30 గం.లకు చిత్తూరు నగరంలోని అగ్నిమాపక కేంద్రం సమీపంలోని ఉర్దూ షాదీ మహల్‌లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ విందు ఏర్పాటు చేశారు.


