News April 14, 2024

NLG: ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ ఫోకస్

image

నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతున్నది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకుగాను ఈ యాసంగిలో జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 171 కోట్ల రూపాయల విలువ చేసే 77,783 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. శనివారం నాటికి రూ.12.66 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు.

Similar News

News March 25, 2026

నల్గొండ: నియోజకవర్గ ఏర్పాటుపై గిరిజనుల గళం

image

సాగర్ ఆయకట్టు పరిధిలో గిరిజన ప్రత్యేక నియోజకవర్గ ఏర్పాటుపై చర్చ జోరందుకుంది. దామరచర్ల, తిరుమలగిరి(సాగర్), త్రిపురారం, నిడమనూరు మండలాల్లో గిరిజన జనాభా అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ 4 మండలాల్లో కలిపి దాదాపు 30 వేలకు పైగా గిరిజన ఓటర్లు ఉండటంతో, వీటిని కలిపి ‘త్రిపురారం’ లేదా పాత తాలూకా కేంద్రమైన ‘నిడమనూరు’ పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

NLG: 31వరకు ఆసరా పింఛన్ల పంపిణీ

image

జిల్లాలోని వివిధ రకాల పింఛనుదార్లకు మార్చి నెలకు సంబంధించిన నగదు పంపిణీపై జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కీలక ప్రకటన విడుదల చేశారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళా పింఛన్లు పొందుతున్న వారందరికీ మార్చి 31 వరకు పింఛను బట్వాడా చేయబడుతుందని పీడీ శేఖర్ రెడ్డి తెలిపారు. పింఛను మొత్తాన్ని నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండే తీసుకోవాలన్నారు.