News April 14, 2024

పంజాబ్ చెత్త రికార్డు

image

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. హోం గ్రౌండ్‌లో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా పంజాబ్ నిలిచింది. ఇప్పటివరకూ 73 మ్యాచ్‌ల్లో ఆ జట్టు సొంత మైదానంలో ఓడింది. ఆ తర్వాతి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ 72 పర్యాయాలు ఓటమి పాలైంది. ఆతర్వాత ఆర్సీబీ (67) ఉంది. కాగా నిన్న రాజస్థాన్ చేతిలో పంజాబ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Similar News

News February 3, 2026

ట్రంప్ డీల్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

అమెరికా అధ్యక్షుడు <<19035036>>ట్రంప్ డీల్<<>> ప్రకటనతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగు తీస్తున్నాయి. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 2300 పాయింట్లకు పైగా లాభపడి 84,015 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 734 పాయింట్ల లాభంతో 25,822 వద్ద కొనసాగుతోంది. BSEలోని అన్ని సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.

News February 3, 2026

ఐరన్ లోపం ఉంటే ఏం తినాలంటే?

image

ఐరన్‌ లోపంతో గుండె, బ్రెయిన్, కిడ్నీ, లివర్‌పై ఎఫెక్ట్‌ పడుతుందంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే నువ్వులు, ఖర్జూరం, కిస్‌మిస్, బీట్‌రూట్, క్యారెట్, మునగాకు, పాలకూర, ఆకుపచ్చ కూరగాయలు, బ్రొకొలీ, పిస్తా, బాదంపప్పు, మటన్ లివర్, పల్లీలు, యాప్రికాట్స్, కోడిగుడ్లు, అవకాడో, కొత్తిమీర, బాదం, జీడిపప్పు, జామ, దానిమ్మ, స్ట్రాబెర్రీ, ఉల్లి, ముల్లంగి, టమాట ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

News February 3, 2026

ఏపీలో ఎక్కువ సాగవుతున్న ఆయిల్ పామ్ రకాలు

image

☛ కోస్టారికా: ఏపీలో ఎక్కువగా సాగవుతున్న ఆయిల్ పామ్ రకం ఇది. ఈ చెట్లు చాలా పొడవుగా పెరుగుతాయి. గెలల పరిమాణం పెద్దగా వస్తాయి. ఎక్కువ బరువు ఉంటాయి. ☛ సిరాడ్ షార్ట్: ఈ రకం మొక్క మట్టలు తక్కువ సైజులో వస్తాయి. ఈ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగవు. గెలల సంఖ్య ఎక్కువ. గెలల బరువు తక్కువ బరువు ఉన్నా.. ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల రైతులు ఈ రకం సాగుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.