News April 14, 2024
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీ సమస్యలు: సర్వే

ఫెయిర్‌నెస్ క్రీములతో భారత్‌లో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయని తాజా సర్వేలో తేలింది. అధికంగా పాదరసం వాడటమే దీనికి కారణమని పేర్కొంది. ఈ క్రీములను ఉపయోగించడంతో మెంబ్రేనస్ నెఫ్రోపతి(MN) కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీస్తూ ప్రొటీన్ లీకేజీకి కారణమవుతుందని తెలిపింది. ఆరోగ్యానికి హాని చేసే ఈ తరహా ఉత్పత్తుల వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News March 24, 2026
పుదుచ్చేరి పీఠం ఎవరిదో? – 1/2

నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి భవితవ్యం కూడా ఈసారి ఆసక్తికరంగా మారాయి. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (AINRC) ఆధ్వర్యంలోని NDA మరోసారి అధికారంలోకి రావాలనుకుంటోంది. అయితే AINRC-BJP దోస్తీ కాస్త సడలిందనే టాక్ నడుస్తోంది. అమిత్ షా బుజ్జగింపుతో AINRC చీఫ్, పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి శాంతించినా విజయ్ TVK ఎంట్రీ, రాష్ట్ర హోదా డిమాండ్ హాట్ టాపిక్‌గా మారింది. <<-se>>#Elections2026<<>>
News March 24, 2026
పుదుచ్చేరి పీఠం ఎవరిదో? – 2/2

పాలనపై పూర్తి కంట్రోల్ ఉండట్లేదని, ఈసారి NDA కూటమిలో లాట్చియ జననాయగ కట్చి అనే పార్టీ చేరడం AINRC అసంతృప్తికి కారణం. దీనిని కాంగ్రెస్-DMK తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రహోదా డిమాండ్‌ను కూడా ఎన్నికల అస్త్రంగా వాడుకునే ఛాన్స్ ఉంది. విజయ్ TVK 30 సీట్లలోనూ సోలోగా పోటీ చేయనుండటంతో ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి. ఇక NDAలో భాగమైన AIADMK ఇక్కడ ఉనికి కోసం పోరాడుతోంది. <<-se>>#Elections2026<<>>
News March 24, 2026
కక్ష ఉంటే నాపై తీర్చుకోండి: KTR

TG: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు లొట్టపీసు కేసు అని KTR అన్నారు. ACB <<19460633>>ఛార్జ్‌షీట్‌పై<<>> ఆయన స్పందించారు. ‘ఈ-కార్ రేసులో నిధుల దుర్వినియోగం జరగలేదు. బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరిగాయి. తప్పు చేయని అధికారులను ఎందుకు ఇరికించారు. కక్ష ఉంటే నాపై తీర్చుకోండి’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందిస్తూ ‘లొట్టపీసు కేసు అయితే భయమెందుకు? ధైర్యంగా ఎదుర్కోవాలి’ అని కౌంటరిచ్చారు.


