News April 14, 2024

విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారు: భట్టి

image

విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన కేసీఆర్ చేవెళ్ల సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులపాలు చేశారని మండిపడ్డారు. అదనంగా ఎకరం భూమికి కూడా నీరు ఇవ్వని కాళేశ్వరానికి ఏడాదికి రూ.10 వేల కోట్ల విద్యుత్ బిల్లులు కట్టేలా చేశారని ఆరోపించారు. ఒక్క గంట కూడా కరెంట్ పోకుండా సరఫరా చేస్తున్నాం అని మోసం చేశారన్నారు.

Similar News

News March 3, 2026

ఖమ్మం: ఇంటింటికీ నల్లా.. పంచాయతీలకే తాగునీటి బాధ్యత

image

ఖమ్మం జిల్లాలో తాగునీటి కష్టాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ పథకం సిద్ధమైంది. ఈ పథకంలో భాగంగా గ్రామాల్లోని ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, పైపులైన్ల నిర్వహణ బాధ్యతలను ఇకపై నేరుగా గ్రామ పంచాయతీలకే అప్పగించనున్నారు. సర్పంచి అధ్యక్షతన ఉండే ‘గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల’ ద్వారా ప్రతి ఇంటికీ 100 శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చి, నిరంతర సరఫరాను పర్యవేక్షిస్తారు.

News March 3, 2026

ఖమ్మం: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఫలితాలు విడుదల

image

ఖమ్మంలో జనవరిలో నిర్వహించిన డ్రాయింగ్ హయ్యర్, లోయర్ అలాగే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసినట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు. అభ్యర్థులు తమ పుట్టిన తేదీ, రోల్ నంబర్ నమోదు చేసి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు.

News March 3, 2026

నేడు ఖమ్మం కమిషనరేట్‌లో మద్యం దుకాణాలు బంద్‌

image

హోలీ పండుగను పురస్కరించుకుని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మార్చి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.