News April 14, 2024

రాళ్లతో కాదు ఓట్లతో దాడి చేయండి

image

AP: ఎన్నికల వేళ రాజకీయ నాయకులపై ప్రత్యర్థులు రాళ్లు విసరడం కలకలం రేపుతోంది. నిన్న సీఎం జగన్‌పై రాయితో దాడి జరగడంతో ఆయనకు గాయమైంది. ఇవాళ పవన్ కళ్యాణ్, చంద్రబాబు సభల్లోనూ ఆగంతకులు రాళ్లు విసిరారు. రాజకీయాల్లో ఇలాంటి విపరీత చర్యలు శ్రేయస్కరం కాదు. రాళ్లు వేయడం మంచి పద్ధతి కాదు. నాయకులపై వ్యతిరేకతను రాళ్లతో కాకుండా ఓట్ల రూపంలో చూపించండి. అప్పుడే రాష్ట్ర భవిష్యత్తును మార్చినవారవుతారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 12, 2026

దారుణం: కాలేజీ అమ్మాయిల ఫొటోలు తీసి..

image

AP: ఏఐతో అద్భుతాలు చేయాల్సిన విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ బరితెగిస్తున్నారు. శ్రీకాకుళం(D) గురజాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇటీవల ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా తోటి విద్యార్థినుల ఫొటోలు తీసిన కొందరు ఆకతాయిలు AIతో వాటిని అశ్లీలంగా మార్చారు. విషయం తెలియడంతో అమ్మాయిలు ఆందోళనకు దిగారు. నిందితులకు యాజమాన్యం TCలు ఇచ్చి పంపినట్లు సమాచారం.

News March 12, 2026

డొమెస్టిక్ సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్

image

TG: రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్‌కు కొరత లేదని.. దీనిపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. హోటల్ పరిశ్రమకు LPG అవసరాలు తీర్చడం పెద్ద సమస్య అని పేర్కొన్నారు. రేపు గ్యాస్ కంపెనీలతో సమావేశమై పరిస్థితిపై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సిలిండర్లు బ్లాక్ చేస్తే ఏజెన్సీలను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.

News March 12, 2026

క్యాప్ జెమినీ సీఈవోతో మంత్రి లోకేశ్ భేటీ

image

AP: విశాఖలో క్యాప్‌జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఎజత్‌తో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. సిటీలో ఆ సంస్థ పెట్టుబడులపైన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 20వేల ఉద్యోగాలు కల్పించేలా ఐటీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని సంస్థను లోకేశ్ కోరారు. భూకేటాయింపులపై ఇప్పటికే మధురవాడ ఐటీ పార్క్‌లో 20ఎకరాలు పరిశీలించగా.. అడవివరం, ఆనందపురంలోని భూములను కూడా ప్రతినిధులు పరిశీలించారు.