News April 14, 2024
రేపు గుడివాడలో జగన్ బహిరంగ సభ
AP: విజయవాడలో రాయి దాడి ఘటనతో CM జగన్ మేమంతా సిద్ధం యాత్రకు ఇవాళ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా రేపు జగన్ యాత్ర కేసరపల్లి నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 9గంటలకు గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, జొన్నపాడు మీదుగా యాత్ర గుడివాడ చేరుకుంటుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకుని రాత్రికి అక్కడే జగన్ బస చేస్తారు.
Similar News
News November 17, 2024
ఆవు పేడలో నోట్ల కట్టలు
HYDలోని ఓ అగ్రో కంపెనీలో పనిచేసే గోపాల్ బెహరా సంస్థ లాకర్ నుంచి రూ.20లక్షలు తీసుకుని పరారయ్యాడు. ఆ డబ్బును ఒడిశా బాలాసోర్ జిల్లాలోని బాదమందరుని గ్రామానికి తరలించినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసులతో కలిసి అతని అత్తమామలపై ఇంట్లో తనిఖీలు చేశారు. చివరికి ఆవు పేడ కుప్పలో నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుని కోసం గాలిస్తున్నామని తెలిపారు.
News November 17, 2024
అణ్వాయుధాల తయారీ AIకి ఇవ్వొద్దు.. US, చైనా ఒప్పందం
AI ఊహాతీతంగా ప్రవర్తించేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో అణ్వాయుధాల తయారీ, నిర్వహణ దాని చేతిలో ఎప్పుడూ పెట్టకూడదని US, చైనా తాజాగా అంగీకరించాయి. పెరూలో జరిగిన APEC సదస్సులో ఇరు దేశాల అధ్యక్షులు భేటీ అయిన సందర్భంగా అణ్వాయుధాలను మనుషులు మాత్రమే హ్యాండిల్ చేయాలని నిర్ణయించారు. రక్షణ రంగంలో AIని బాధ్యతగా వాడాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం US వద్ద 5044, చైనా వద్ద 500 అణు వార్‌హెడ్స్ ఉన్నాయి.
News November 17, 2024
చికెన్ పులుసుతో జలుబు తగ్గుతుందా?
జలుబు చేసి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే మసాలా దట్టించిన చికెన్ పులుసు కూర తినండి/సూప్ తాగండనే మాట తరుచూ వింటూ ఉంటాం. ఇందులో కొంత వరకు నిజం ఉందని నిపుణులు చెబుతున్నారు. కూరలో వాడే అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసుల కారణంగా కొంచెం ఉపశమనం కలుగుతుందని, ముక్కు రంధ్రాలు క్లియర్ అవుతాయని పేర్కొంటున్నారు. అయితే జలుబు పూర్తిగా మటుమాయం కాదంటున్నారు.