News April 14, 2024

జగన్‌కు ప్రమాదం తప్పింది: కేశినేని నాని

image

AP: జగన్‌కు అదృష్టవశాత్తు ప్రమాదం తప్పిందని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ‘చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్‌పై దాడి వెనుక పెద్ద కుట్ర ఉంది. బోండా ఉమ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. జగన్‌పై దాడికి చంద్రబాబు, లోకేశ్, బోండా ఉమానే కారణం. విజయవాడలో అల్లర్లు సృష్టించాలన్నదే వారి కుట్ర. దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News March 20, 2026

తగ్గనున్న డయాబెటిస్ మందుల ధరలు!

image

డయాబెటిస్, ఒబెసిటీ మందుల ధరలు తగ్గనున్నాయి. వీటి చికిత్సలో కీలకమైన సెమాగ్లుటైడ్(ఒజెంపిక్, వెగోవి) పేటెంట్ నేటితో ముగియనుంది. దీంతో ఈ మెడిసిన్‌ను పేటెంట్‌తో పని లేకుండా ప్రభుత్వ అనుమతితో తయారు చేసి విక్రయించేందుకు వీలు దొరకనుంది. దీంతో ధరలు 50-70% తగ్గే అవకాశం ఉంది. తద్వారా ఏటా ₹60 వేలు-70 వేలు ఆదా కానుంది. టైప్-2 డయాబెటిస్ రోగులలో షుగర్ నియంత్రణకు ఒజెంపిక్, ఒబెసిటీ చికిత్సలో వెగోవిని వాడతారు.

News March 20, 2026

నేడు తిరుమలకు చంద్రబాబు, లోకేశ్

image

AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా వేంకటేశ్వరుడి ఆశీస్సులు తీసుకోనున్నారు. మంత్రి కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి రేణిగుంట, అక్కడి నుంచి తిరుమలకు చేరుకోనున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో తిరుపతి చేరుకొని అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటారు.

News March 20, 2026

4 విడతల్లో 41 నోటిఫికేషన్లు!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం నిన్న <<19422391>>జాబ్ క్యాలెండర్<<>> రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే 10,060 పోస్టులు భర్తీ చేస్తామంది. ఇందుకోసం 4 విడతల్లో విభాగాల వారీగా 41 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా DSC-2,535, కానిస్టేబుల్-1,970, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్-1,500, గ్రూప్2-750, AEE-503, SI-418, ఎక్సైజ్ కానిస్టేబుల్-400, ప్లానింగ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్-251 ఖాళీలు ఉన్నాయి.