News April 14, 2024

2 లక్షల భారతీయుల ‘ఎక్స్’ ఖాతాలపై నిషేధం

image

నిబంధనలు ఉల్లంఘించిన భారతీయుల ఖాతాలను ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X(ట్విటర్) నిషేధించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 25 మధ్య మొత్తం 2,12,627 ఖాతాలపై వేటు వేసినట్లు పేర్కొంది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈ మేరకు చర్యలు తీసుకున్నామని చెప్పింది. వీటిలో చిన్నారులపై లైంగిక వేధింపులు, అడల్ట్ కంటెంట్‌ను ప్రోత్సహించే ఖాతాలు ఉన్నట్లు తెలిపింది.

Similar News

News March 19, 2026

20వ రోజుకు యుద్ధం.. 2వేలకుపైగా మరణాలు!

image

అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ పోరు ప్రారంభమై నేటికి 20 రోజులు. పశ్చిమాసియాకు పాకిన ఈ యుద్ధంతో చమురు సంక్షోభం నెలకొనగా.. మరణాల సంఖ్య 2000 దాటింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్‌లో ఇప్పటివరకు 1200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్లో 850 మంది, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడుల్లో 13 మంది చనిపోగా మరో 13 మంది US సర్వీస్ మెంబర్స్ కూడా మృతిచెందారు.

News March 19, 2026

CSKకు బిగ్ షాక్.. కీలక బౌలర్ దూరం

image

మరో 9 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSK జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్(AUS) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ విషయాన్ని CSK CEO విశ్వనాథన్ తాజాగా ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ఆయన స్థానంలో వేరే బౌలర్ కోసం చూస్తున్నామన్నారు. డెత్ ఓవర్లలో ఎల్లిస్ కీలక బౌలర్ అని, ఆయన దూరమవడం తమకు పెద్ద దెబ్బ అని విశ్వనాథన్ పేర్కొన్నారు.

News March 19, 2026

ఇరాన్ ఆ కేబుల్స్ కట్ చేస్తే ఇంటర్నెట్ బంద్!

image

పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంటర్నెట్ కనెక్షన్లనూ దెబ్బతీసే ప్రమాదం ఉంది. హార్ముజ్, బాబ్-ఎల్-మాండెబ్ జలసంధుల కింద పెద్ద ఎత్తున డేటా కేబుల్స్ ఉన్నాయి. ఇవి యూరప్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను లింక్ చేస్తున్నాయి. యుద్ధంలో భాగంగా ఇవి ధ్వంసమైతే మనకు ఇబ్బందులు తప్పవు. 2024లో హౌతీల దాడుల సమయంలో ఇదే జరిగింది. పైగా మిలిటరీ యాక్టివిటీ వల్ల వాటిని రిపేర్ చేయడానికి నెలల సమయం పట్టింది.