News April 14, 2024
సంగారెడ్డి: BRS హయాంలో నిర్బంధాలకు గురయ్యాం: మంత్రి కొండా సురేఖ

తాను ఎవ్వరికీ భయపడేది లేదని, భయపడితే రాజకీయం చేయలేమని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలో అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ జగ్గారెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అక్రమ కేసులు నమోదై జైలుకు వెళ్లామన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్బంధాలకు గురయ్యామని అన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు.
Similar News
News March 12, 2026
మెదక్: టెన్త్ పరీక్షలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ కార్యాలయంలో 9848214166 కంట్రోల్ రూమ్ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పట్టుదల, క్రమశిక్షణతో చదివి మెదక్ జిల్లాను పదో తరగతి ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిపి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. జిల్లాలో ఇందుకోసం మొత్తం 68 రెగ్యులర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News March 12, 2026
తూప్రాన్: విషాదం.. కొడుకు కోసం వెళ్లి తల్లి మృతి

తూప్రాన్ పట్టణ పరిధిలోని కరీంగూడకు చెందిన గోగుల లక్ష్మి(45) కొడుకును వెతికేందుకు వెళ్లిన నీటిలో మునిగి చనిపోయింది. మూడు రోజులుగా పనులకు వెళ్లిన కోడుకు కనిపించకుండా పోవడంతో నిన్న రాత్రి కొడుకును వెతికేందుకు వెళ్లిన ఆమె అల్లాపూర్ శివారులోని నీటిలో పడి మృతి చెందింది. గురువారం మృతదేహాన్ని గుర్తించగా కొడుకు ఫిర్యాదుతో తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 12, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు 96.71 % హాజరు

మెదక్ జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 6085 మందికి గాను 5895 మంది, ఒకేషనల్ విభాగంలో 279 మందికి గాను 260 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 96.71% హాజరు నమోదైంది. నేటితో మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.


