News April 14, 2024
సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా మంత్రులు, నేతలు

రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ MP అభ్యర్థులు, ఇంచార్జిలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ అభ్యర్థులు, ఇన్చార్జులు పాల్గొన్నారు. పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి కావ్య పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్

SIR మ్యాపింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం, ఆమె జిల్లా అధికారులతో సమీక్షించారు. బూత్ స్థాయి అధికారులకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని, బూత్ స్థాయి ఏజెంట్ల నియామక ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (RDO)ను కలెక్టర్ ఆదేశించారు.
News March 13, 2026
బ్లాక్‌లో గ్యాస్ అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్ సత్య శారద

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో విక్రయిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరంతరాయంగా గ్యాస్ సరఫరాను పర్యవేక్షించాల్సిన బాధ్యత కమిటీపై ఉందన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 13, 2026
జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జనాభా లెక్కల సేకరణ ప్రభుత్వ పథకాల అమలుకు, దేశాభివృద్ధికి దిక్సూచి వంటిదని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జనగణన-2027పై అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తప్పులకు తావులేకుండా పారదర్శకమైన డేటాను సేకరించాలని సూచించారు.


