News April 15, 2024

TODAY HEADLINES

image

➢14 అంశాలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల
➢పెట్రోల్ ధరలు తగ్గిస్తాం: మోదీ
➢AP:కులాన్ని నమ్ముకుని రాజకీయం చేయట్లేదు: పవన్
➢బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా: CBN
➢AP:పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ అటెంప్ట్: సజ్జల
➢TG:గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం: మంత్రి సురేఖ
➢BJP అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు: MP లక్ష్మణ్
➢IPL: లక్నోపై కోల్‌కతా, ముంబైపై చెన్నై విజయం

Similar News

News February 1, 2026

2 గంటలుగా కేసీఆర్ విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ రెండు గంటలుగా విచారిస్తోంది. అధికారులు ఏం ప్రశ్నలు అడిగారు? ఆయన ఏం సమాధానాలిచ్చారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే కేసులో ఇప్పటికే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, అడిషనల్ ఎస్పీలు రాధాకిషన్ రావు, తిరుపతన్న, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్‌లను సిట్ విచారించిన విషయం తెలిసిందే.

News February 1, 2026

పొద్దుతిరుగుడు సాగు.. విత్తన మోతాదు, విత్తనశుద్ధి

image

యాసంగిలో పొద్దుతిరుగుడు సాగుకు సాధారణంగా ఎకరానికి 2.5-3.0 కిలోల విత్తనం అవసరం. పంట మొదటి దశలో ఆశించే చీడపీడల నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.0 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5.0 మి.లీ. కలిపి విత్తనశుద్ధి చేయాలి. సాధారణ దుక్కి పద్ధతిలో లేదా వరికోతలు తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో నవంబర్, డిసెంబర్ నెలల్లో విత్తుకోవచ్చు. వరికోతలు ఆలస్యమైన ప్రాంతాల్లో ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.

News February 1, 2026

ESIC మోడల్ హాస్పిటల్ బడ్డీలో ఉద్యోగాలు

image

<>ESIC <<>>మోడల్ హాస్పిటల్ బడ్డీ(H.P.)లో 41 స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు ఫిబ్రవరి 12న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MBBS, పీజీ, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. స్పెషలిస్ట్ పోస్టులకు గరిష్ఠ వయసు 69ఏళ్లు కాగా, సీనియర్ రెసిడెంట్ పోస్టులకు 45ఏళ్లు. వెబ్‌సైట్: https://esic.gov.in/