News April 15, 2024
విజయవాడ: ‘జగన్‌పై దాడి ఘటనలో దోషులను వెంటనే పట్టుకోవాలి’

సీఎం జగన్‌పై దాడి ఘటనలో దోషులను తక్షణమే పట్టుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వైసీపీ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యంలో హింసకు తావులేదన్నారు. జగన్‌పై దాడి ఘటనలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలను నిగ్గుతేల్చాలని అన్నారు. అనంతరం దోషులను వెంటనే పట్టుకోవాలని డీజీపీని కోరినట్లు చెప్పారు.
Similar News
News March 10, 2026
కృష్ణా: ‘పుర’లో ప్రత్యేక పాలన

స్థానిక సంస్థలైన నగర పాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 17తో ముగియనుంది. దీంతో ప్రత్యేక అధికారుల పాలనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 18 నుంచి ప్రత్యేక అధికారులు అధికారం చేపట్టనున్నారు. మచిలీపట్నం కార్పొరేషన్‌కు కలెక్టర్, పెడన మున్సిపాల్టీకి RDO, పెడనకు MUDA VC ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు.
News March 10, 2026
చల్లపల్లిలో బాలిక ఆత్మహత్య

చల్లపల్లి(M) నారాయణరావునగర్‌లో విషాద ఘటన సోమవారం చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలిక కడుపునొప్పితో స్కూలుకు వెళ్లకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకుంది. గమనించిన తల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 10, 2026
కృష్ణా: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలో విద్యార్థుల సౌకర్యార్థం APSRTC ఉచిత BUS సర్వీస్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షల రోజుల్లో విద్యార్థులు తమ నివాస ప్రాంతం నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లి తిరిగి రావడానికి హాల్ టికెట్ చూపించి అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.


