News November 19, 2025
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
Similar News
News December 13, 2025
మరో అరగంటలో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ!

హైదరాబాద్‌లో మెస్సీ మేనియా నడుస్తోంది. మరో అరగంటలో ఆయన ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి రానున్నట్లు సమాచారం. దీంతో వందలాది మంది ఫుడ్ బాల్ క్రీడాకారులు, అభిమానులు పాస్‌లు తీసుకొని స్టేడియానికి పోటెత్తారు. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు నడుమ స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. కొందరేమో మెస్సీకి అభివాదం చెప్పేందుకు స్టేడియం బయట బారులు తీరారు.
News December 13, 2025
HYD: మెస్సీ మ్యాచ్..NOT ALLOWED

ఉప్పల్‌లో నేడు జరగనున్న “మెస్సీ” గోట్ ఇండియా టూర్ లైవ్ ఈవెంట్ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కఠిన భద్రతా నిబంధనలు అమలు చేస్తోంది. ప్రజల భద్రత దృష్ట్యా కెమెరాలు, బ్లూటూత్ హెడ్‌ఫోన్లు, సిగరెట్లు, లైటర్లు, ఆయుధాలు, నీటి సీసాలు, మద్యం, ఆహారం, బ్యాగులు, ల్యాప్‌టాప్‌లు, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్లు, బైనాక్యులర్లు, పటాకులు, మత్తు పదార్థాల వంటి వస్తువులకు అనుమతి లేదన్నారు.
News December 13, 2025
HYD: ప్రముఖుల బసకు చిరునామా.. ఫలక్‌నుమా

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈరోజు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్‌లో పాల్గొననున్నారు. దీని కోసం హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీకి ప్రభుత్వం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బస ఏర్పాటు చేసింది. ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రముఖులు బస చేసేందకు చిరునామాగా మారింది. దీన్ని 1893లో నిర్మించగా.. 1895 నుంచి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గెస్ట్ హౌస్‌గా వాడేవారు. ప్రస్తుతం తాజ్ గ్రూప్ ప్యాలెస్‌ను లీజ్ తీసుకుంది.


