News April 15, 2024

విశాఖ: నేడు డయల్ యువర్ సీపీ కార్యక్రమం

image

నేడు డయల్ యువర్ సీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ.రవిశంకర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కమిషనరేట్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను 0891-2523408 నంబర్‌కు డయల్ చేసి తెలియపరచాలని సూచించారు. అనంతరం 12 గంటల నుంచి 12.30 గంటల వరకు వృద్ధుల సమస్యలు, ఫిర్యాదుల కోసం సమయం కేటాయించడం జరిగిందని చెప్పారు.

Similar News

News October 7, 2025

విశాఖలో ప్రారంభమైన రక్త మార్పిడి సేవలపై జాతీయ వర్క్‌షాప్

image

ఏపీ రక్త మార్పిడి సేవల విభాగం, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో “రక్తం,రక్త ఉత్పత్తుల హేతుబద్ధ వినియోగం” అంశంపై రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్ విశాఖలో మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జెనరల్ డా.సునీత శర్మ, NBTC డైరెక్టర్ డా.కృష్ణ కుమార్, WHO ప్రతినిధి డా.మాధుర్ గుప్తా పాల్గొన్నారు.

News October 7, 2025

రుస్తోంజీ గ్రూప్ ఛైర్మన్ బొమన్ ఇరానీతో నారా లోకేష్ భేటీ

image

రుస్తోంజీ గ్రూప్ ఛైర్మన్ బొమన్ ఇరానీతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో భేటీ అయ్యారు. ఐటీ కంపెనీలు, డేటా సెంటర్ల రాకతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహా నగరంలో లగ్జరీ టౌన్ షిప్ నిర్మాణం చేపట్టాలని మంత్రి లోకేష్ ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బాగస్వామ్యం అవ్వాలని కోరారు.

News October 6, 2025

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు

image

భారత మహిళా క్రికెట్ జట్టు సోమవారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు జట్టుకు స్వాగతం పలికారు. గురువారం దక్షిణ ఆఫ్రికా జట్టుతో భారత జట్టు పీఎం పాలెం స్టేడియం వేదికగా తలపడనుంది. మంగళ, బుధవారాల్లో మహిళా జట్టు స్టేడియంలో ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ మ్యాచ్ టికెట్ల కోసం క్రీడాభిమానులు కొనుగోలు కోసం ఆసక్తి చూపుతున్నారు.