News April 15, 2024
పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రం చేస్తాం: మాయావతి
ఎన్నికల వేళ యూపీ మాజీ సీఎం, బీఎస్‌పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు. ‘బీజేపీ మరోసారి అధికారంలోకి తక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఓటింగ్ మెషీన్స్ ట్యాంపర్ కాకుండా, పారదర్శకంగా ఎన్నికలు జరిగితే బీజేపీ గెలవదు. ధనికులను మరింత సంపన్నులుగా తీర్చిదిద్దేందుకే బీజేపీ కృషి చేస్తోంది’ అని విమర్శించారు.
Similar News
News November 17, 2024
టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చేశారు!
పిల్లలు పిడుగులు అంటే ఇదేనేమో. టీచర్ మీద కోపంతో బాంబు తయారుచేసి పేల్చారు. హరియాణాలో ఓ సైన్స్ టీచర్ 12వ తరగతి విద్యార్థులను తిట్టారు. ఇది మనసులో పెట్టుకున్న స్టూడెంట్స్ ప్రాంక్ చేద్దామని యూట్యూబ్‌లో చూసి చిన్న బాంబు తయారుచేశారు. టీచర్ చైర్ కింద పెట్టి రిమోట్ కంట్రోల్‌తో పేల్చేశారు. ఈ ఘటనలో టీచర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఆ విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేయగా టీచర్ క్షమించడంతో వదిలిపెట్టారు.
News November 17, 2024
రోహిత్ వెంటనే ఆసీస్ వెళ్లాలి: గంగూలీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పాల్గొనేందుకు రోహిత్ శర్మ వీలైనంత త్వరగా ఆస్ట్రేలియా వెళ్లాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ‘రోహిత్ అద్భుతమైన కెప్టెన్. ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత జట్టుకు అతడి లీడర్‌షిప్ అవసరం. రోహిత్ భార్య ఇప్పటికే బిడ్డకు జన్మనిచ్చారు కాబట్టి అతడు వెళ్లి పెర్త్ టెస్ట్ ఆడాలి’ అని సూచించారు. ఈ సిరీస్ తర్వాత రోహిత్ మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లకపోవచ్చని గంగూలీ వ్యాఖ్యానించారు.
News November 17, 2024
క్రిమినల్‌పై ‘పావలా’ రివార్డు
నేరస్థులు, మావోలు, సంఘవిద్రోహ శక్తులను పట్టుకునేందుకు వారిస్థాయిని బట్టి పోలీసులు రివార్డులు ప్రకటించడం సహజం. అయితే రాజస్థాన్‌లోని లఖన్‌పుర్ పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. ఖుబీరామ్ జాట్(48) అనే క్రిమినల్‌పై కేవలం పావలా రివార్డు ప్రకటించారు. నేరస్థుల స్థాయిని తక్కువ చేసి చూపడం, వారు కోరుకునే గుర్తింపును దక్కకుండా చేయడం కోసమే పోలీసులు ఇలా చేసినట్లు తెలుస్తోంది.