News April 15, 2024
ప్రపంచం ఇంక యుద్ధాలను తట్టుకోలేదు: యూఎన్

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంపై యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. మిడిల్ ఈస్ట్ పతనం అంచున ఉందని, ఆ ప్రాంతం సహా ప్రపంచ దేశాలు ఇక యుద్ధాలను తట్టుకోలేవన్నారు. ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. కాగా ఇరాన్ మిసైల్ దాడులను ఇజ్రాయెల్ దీటుగా ఎదుర్కొంది. అయితే ఎదురుదాడిపై ఆలోచించుకోవాలని ఇజ్రాయెల్‌ను మిత్రదేశాలు హెచ్చరిస్తున్నాయి.
Similar News
News March 17, 2026
సీఎం హార్వర్డ్ కోర్సుకు ప్రభుత్వమే ఫీజు చెల్లించింది: KTR

TG: సీఎం రేవంత్ <<18999625>>హార్వర్డ్<<>> కోర్సు ఫీజులు, విమాన ఖర్చులు ప్రభుత్వమే చెల్లించిందని అసెంబ్లీలో KTR ఆరోపించారు. ‘RTI ద్వారా వివరాలు తెలుసుకున్నాం. సర్కార్ విద్యాశాఖ మంత్రి(రేవంత్) ఫీజులు కడుతుంది కానీ రాష్ట్రంలోని విద్యార్థుల రూ.10వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించదా? గురుకులాల్లో నిత్యం మరణమృదంగం వినిపిస్తోంది. యూనివర్సిటీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది’ అని మండిపడ్డారు.
News March 17, 2026
20 లక్షల ఉద్యోగాలే టార్గెట్: లోకేశ్

AP: పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు(APEDB) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఉద్యోగాల కల్పనే సింగిల్ అజెండాగా ఉండాలన్నారు. ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని ఆదేశించారు.
News March 17, 2026
పాక్ దాడి పిరికిపంద చర్య: భారత్

అఫ్గానిస్థాన్‌లోని ఆస్పత్రిపై <<19403539>>పాకిస్థాన్ దాడిని<<>> భారత్ ఖండించింది. రంజాన్ వేళ ఇలా చేయడం దారుణమని మండిపడింది. దీన్ని అఫ్గాన్ సార్వభౌమత్వంపై దాడిగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఇది మిలిటరీ దాడి కాదు మారణహోమమని పేర్కొంది. ఇదొక పిరికిపంద చర్యగా అభివర్ణించింది. కాగా పాక్ దాడిలో దాదాపు 400 మంది అమాయకులు మరణించారు.


