News April 15, 2024
నేడు, రేపు భానుడి భగభగలు
TG: రాష్ట్రంలో నిన్నటి పోలిస్తే నేడు, రేపు ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌కుపైగా నమోదయ్యాయి. గరిష్ఠంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలాల్లో 42.7 డిగ్రీలు రికార్డ్ అయ్యాయి. మరోవైపు రాజధాని హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. మూసాపేటలో గరిష్ఠంగా 41 డిగ్రీలు నమోదైంది.
Similar News
News November 17, 2024
టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్
ఆస్ట్రేలియా టూర్‌లో తొలి మ్యాచ్ మొదలుకాక ముందే గాయాల బెడదతో ఉన్న టీమ్ ఇండియాకు స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 15న ప్రాక్టీస్‌లో గాయపడ్డ KL రాహల్ కోలుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో మోచేతికి బంతి బలంగా తాకడంతో ఆయన నొప్పితో మైదానం వీడారు. దీంతో పెర్త్‌లో జరిగే తొలి టెస్టుకు రాహుల్ అనుమానమేనన్న వార్తలు వచ్చాయి. ఈరోజు ఆయన తిరిగి ప్రాక్టీస్ చేయడంతో అంతా సర్దుకున్నట్లు తెలుస్తోంది.
News November 17, 2024
నాగచైతన్య-శోభిత పెళ్లి శుభలేఖ ఇదేనా?
అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న జరగనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే తాజాగా వారి వెడ్డింగ్ ఇన్విటేషన్ అంటూ ఓ శుభలేఖ వైరల్ అవుతోంది. ఇందులో నాగచైతన్య తరఫున అక్కినేని నాగేశ్వరరావు-అన్నపూర్ణ, దగ్గుబాటి రామానాయుడు-రాజేశ్వరి పేర్లు కూడా ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి జరగనుందని సమాచారం. త్వరలోనే దీనిపై అక్కినేని ఫ్యామిలీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
News November 17, 2024
లౌడ్‌స్పీకర్లతో టార్చర్ చేస్తున్న నార్త్ కొరియా
సౌత్ కొరియాలోని సరిహద్దు గ్రామాల ప్రజలను వేధించడానికి <<13338040>>నార్త్ కొరియా<<>> లౌడ్‌స్పీకర్లతో యుద్ధం మొదలుపెట్టింది. దెయ్యాల అరుపులు, క్రాష్ సౌండ్స్‌ను రోజంతా ప్లే చేస్తూనే ఉంది. దీన్ని ‘నాయిస్ బాంబింగ్’గా పిలుస్తున్నారు. ఈ శబ్దాల వల్ల తమకు నిద్ర కరవైందని, తలనొప్పి, మానసిక సమస్యలు వస్తున్నాయని డాంగ్సన్ గ్రామ ప్రజలు చెబుతున్నారు. కొన్ని నెలలుగా ఇదే తంతు <<13411726>>కొనసాగుతోందని<<>> వాపోతున్నారు.