News April 15, 2024
నారాయణపేటలో నేడు జన జాతర.. హాజరుకానున్న రేవంత్

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం 4 గంటలకు నారాయణపేట వస్తున్నట్లు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి తెలిపారు. సీఎం హోదాలో జిల్లాకు రేవంత్ 2వసారి వస్తున్నారు. ఈ సభకు నారాయణపేట నియోజకవర్గం నుంచి భారీఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం వ్యవధిలోనే మహబూబ్‌నగర్ లోక్ సభ పరిధిలో రెండోసారి రేవంత్ రెడ్డి రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Similar News
News April 22, 2025
Inter Results.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇలా..!

ఇంటర్ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. ఫస్ట్ ఇయర్‌లో 64.24 శాతం మంది పాసయ్యారు. 10,923 మంది పరీక్షలు రాయగా 7,017 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ ఇయర్‌లో 71.35 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 9,946 మంది పరీక్షలు రాయగా 7,096 మంది ఉత్తీర్ణత సాధించారు.
News April 22, 2025
MBNR: KCR సభ.. భారీగా జన సమీకరణకు నేతల ప్లాన్

వరంగల్‌లో ఈనెల 27న BRS రజతోత్సవ భారీ బహిరంగ సభకు MBNR, WNP, NGKL, NRPT, GDWL జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. ఒక్క ఉమ్మడి పాలమూరు నుంచే సభకు 2 లక్షల మందికి పైగా తరలించేందుకు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి సూచనలతో వాహనాలను సిద్ధం చేసుకుంటున్నారు. అందరం KCRసభకు వెళ్దామని శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.
News April 22, 2025
MBNR: కోయిలకొండలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కోయిలకొండలో 42.1 డిగ్రీలు, నవాబుపేట 42.0 డిగ్రీలు, భూత్పూర్ మండలం కొత్తమొల్గర 41.9 డిగ్రీలు, దేవరకద్ర 41.8 డిగ్రీలు, కౌకుంట్ల 41.5 డిగ్రీలు, కోయిలకొండ మండలం పారుపల్లి, మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.