News April 15, 2024

HYD: పదో తరగతి బాలికపై అత్యాచారం

image

బాలిక అదృశ్యమైన కేసులో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. సైదాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన బాలిక దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. దర్యాప్తులో మాదన్నపేటలోని చంద్రాహట్స్‌కు చెందిన రాజేందర్ (22)ను అదుపులోకి తీసుకుని విచారించగా.. బాలికను అపహరించి అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పొక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News September 11, 2025

సీఎం చేతుల మీదుగా మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ ప్రారంభిస్తాం: మేయర్

image

బంజారాహిల్స్‌లోని ఎన్బీటీ నగర్ బస్తీలో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె ఖైరతాబాద్ ZC అనురాగ్ జయంతితో కలిసి ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

News September 11, 2025

HYD: మ్యాన్‌హోల్ తెరిచి ఉంటే కాల్ చేయండి!

image

వ‌ర్షాకాలం వ‌ర‌ద పోయేందుకు వీలుగా మ్యాన్‌హోళ్ల మూత‌లు తెర‌వ‌డం, వ‌ర‌ద త‌గ్గ‌గానే వాటి తిరిగి మూసేస్తున్నట్లు హైడ్రా తెలిపింది. మూత తెరిచి ఉన్న దగ్గర సిబ్బంది ఉండేలా చూస్తామని, ఒక వేళ ఎక్క‌డైనా పొర‌పాటున మ్యాన్‌హోల్ మూత తెర‌చి ఉంటే 9000113667 నంబ‌రుకు కాల్ చేసి తెలియ‌జేయాల‌ని హైడ్రా కోరింది.

News September 11, 2025

29వ తేదీలోగా అన్ని పీజీ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు

image

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల ఇంటర్నల్ పరీక్షలను ఈ నెల 29వ తేదీలోగా నిర్వహించాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను త్వరితగతిన నిర్వహించాలని సూచించారు. ఈ నెల 29వ తేదీలోగా మార్కుల జాబితాను వెబ్‌సైట్లో అప్లోడ్ చేయాలన్నారు.