News November 19, 2025
గంధసిరిలో పులి కాదు నక్క.. వదంతులు నమ్మొద్దు

ముదిగొండ మండలం గంధసిరి సమీపంలో పులి కనిపించిందనే వదంతులు నమ్మవద్దని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు తెలిపిన ప్రదేశాన్ని పరిశీలించగా, అక్కడ సంచరించింది నక్క మాత్రమేనని నిర్ధారించారు. ఈ ప్రాంతంలో పులి సంచారం లేదని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News January 14, 2026
మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకుంటాయి: ట్రంప్

తమ నేషనల్ సెక్యూరిటీ కోసం గ్రీన్‌ల్యాండ్ అవసరం అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. తాము అమెరికాలో చేరబోమని, డెన్మార్క్‌లోనే ఉంటామని గ్రీన్‌ల్యాండ్ ప్రధాని ప్రకటించడంపై ట్రంప్ స్పందించారు. ‘గ్రీన్‌ల్యాండ్ అమెరికా చేతుల్లో ఉండటం వల్ల నాటో మరింత స్ట్రాంగ్ అవుతుంది. మేము కాకుంటే రష్యా, చైనా గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకుంటాయి. అది జరగనివ్వను’ అని పోస్ట్ చేశారు.
News January 14, 2026
విశాఖ నుంచి వందే భారత్ రైళ్లు అదనంగా నడపాలని లేఖ

విశాఖపట్నం విమానాశ్రయం జూన్–జులై నెలల్లో భోగాపురానికి మారనున్న నేపథ్యంలో నగరం నుంచి అదనంగా వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు ప్రయాణికుల రద్దీ మరింత పెరగనుందని లేఖలో వివరించారు.
News January 14, 2026
చిట్వేల్‌లో సంక్రాంతి పండుగ.. కుటుంబం అంతా ఒకే చోట భోజనం..!

సంక్రాంతి పండుగతో కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయని చిట్వేల్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. గత 50 ఏళ్లుగా భోగి రోజున నలుగురు అన్నదమ్ముల కుటుంబాలు కలిసి సంయుక్త అరిటాకు భోజనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. ఈ ఏడాది 46 మంది కుటుంబ సభ్యులు పాల్గొనగా, హైదరాబాదు, బెంగళూరు, విదేశాల్లో ఉన్నవారు కూడా భోగి రోజున కలుస్తారన్నారు. దీంతో కుటుంబాల్లో ప్రేమానురాగాలు మరింత బలపడతాయన్నారు.


