News November 19, 2025
VKB: డీసీసీ పీఠం రఘువీరారెడ్డికి దక్కేనా.!

వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ల రఘువీరారెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అయితే జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన అతనిని ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. BRS పాలనలో జిల్లాను ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడని రఘువీరా రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వాలని పలువురు నాయకులు కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.
Similar News
News March 28, 2026
చరణ్ లుక్.. ‘ఇది బాడీ కాదు.. బాక్సాఫీస్’ అంటున్న ఫ్యాన్స్

‘పెద్ది’ సినిమాలో పహిల్వాన్‌గా ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లుక్ SMను షేక్ చేస్తోంది. కుస్తీ పోటీలోని ఆయన రగ్గుడ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన HD ఫొటోను డైరెక్టర్ బుచ్చిబాబు పోస్ట్ చేశారు. కండలు తిరిగిన దేహంతో కుస్తీ పహిల్వాన్‌గా ఊరమాస్ లుక్ చూసి ‘ఇది బాడీ కాదు.. బాక్సాఫీస్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చరణ్ మేకోవర్ మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి.
News March 28, 2026
వికారాబాద్ జిల్లాలో దారుణ హత్య

పెద్దేముల్ మండల బాయిమీది తండాలో దారుణం జరిగింది. లోక్యానాయక్, బిక్కీబాయి దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. లోక్యానాయక్ మద్యానికి బానిసై బిక్కీబాయి, కుమార్తె సుప్రియను నిత్యం వేధించేవాడు. శుక్రవారం బిక్కిబాయి, సుప్రియను తీవ్రంగా కొట్టడంతో HYDలో ఉన్న కుమారుడు సునీల్‌కు సమాచారం ఇచ్చింది. ఇదే విషయంపై తండ్రితో మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య మాట మాట పెరిగి కుమారుడు ఆగ్రహంతో హత్య చేశాడు.
News March 28, 2026
గిరిజన ఉత్పత్తులకు ‘భద్రగిరి’ వెన్నుదన్ను : తుమ్మల

గిరిజన ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించి, గిరిజన కుటుంబాలకు ఆర్థిక వెసలుబాటు కల్పించడమే లక్ష్యంగా భద్రగిరి మార్ట్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం భద్రాచలంలో ప్రారంభమైన ఈ మార్ట్‌ను గిరిజన రైతులు, మహిళా సంఘాల అభివృద్ధికి ఒక మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ITDA PO రాహుల్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.


