News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.

Similar News

News February 19, 2026

శ్రీకాకుళంలో ఎండలు, ఉక్కబోత ప్రారంభం

image

శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా ఎండలు, ఉక్కబోత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మహాశివరాత్రి తర్వాత రోజుల నుంచి వేడి తీవ్రత మొదలవుతుందని చెబుతున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతుంది. వాతావరణ నిపుణుల ప్రకారం, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

News February 19, 2026

శ్రీకాకుళం IIITలో వేధింపులపై విచారణ

image

ఎచ్చెర్లలో ఉన్న శ్రీకాకుళం ఐఐఐటీ క్యాంపస్ సిబ్బంది విద్యార్థులను వేధిస్తున్నట్లు గతంలో వచ్చిన ఫిర్యాదుకు అంతర్గత కమిటీ విచారణ చేపట్టింది. బుధవారం ఇంజినీరింగ్ విద్యార్థులను, సిబ్బందిని వేర్వేరుగా విచారణ చేశారు. నూజివీడు క్యాంపస్‌కు చెందిన 6 మంది సభ్యుల కమిటీ విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.

News February 19, 2026

శ్రీకాకుళం: 18-30 ఏళ్ల వారికే ఈ అవకాశం

image

నిరుద్యోగ యువతకు ఈనెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. సుధ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని నెహ్రూ యువ కేంద్రంలో ఉదయం 10 గంటలకు ఈ ఎంపికలు ప్రారంభం కానున్నాయి. టాటా క్యాపిటల్స్ లిమిటెడ్, ముత్తూట్ మైక్రో ఫిన్ లిమిటెడ్ హాజరుకానున్నారని, టెన్త్ ఇంటర్ ఆపై విద్యార్హత ఉండి, 18 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు గల వారు అర్హులన్నారు.