News November 19, 2025

మెదక్: ‘స్థానికం’పై చిగురిస్తున్న ‘ఆశలు’

image

42% రిజర్వేషన్లపై ఎన్నికలు నిర్వహించవద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు సూచించింది. దీంతో ప్రభుత్వం రిజర్వేషన్లు మార్చి ఎన్నికలకు ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News March 4, 2026

మంథని: పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం మంథని పర్యటన సందర్భంగా గౌతమి నగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులతో పాఠ్యాంశాలను చదివించారు. మధ్యాహ్న భోజనం, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News March 4, 2026

YELLOW ALERT: 5 రోజులు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో మార్చిలోనే ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. అటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో HYD వాతావరణ కేంద్రం పిడుగులాంటి వార్త చెప్పింది. రానున్న 5 రోజులు ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీలు నమోదవుతాయని వెల్లడించింది. ఈ నెల 7 నుంచి 33 జిల్లాలకూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే 2-3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మీ ఏరియాల్లో టెంపరేచర్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 4, 2026

SRPT: విదేశాల్లో చదవాలనుకునే వారికి దరఖాస్తుల ఆహ్వానం

image

అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానంద రాణి తెలిపారు. అర్హులైన విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9848503644 నంబరును సంప్రదించవచ్చని కోరారు.