News November 19, 2025

HYD: జైలులో మొహియుద్దీన్‌పై దాడి

image

అహ్మదాబాద్ సబర్మతి జైలులో రాజేంద్రనగర్‌కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్‌పై దాడి జరిగింది. తోటి ఖైదీలే అతడిపై దాడి చేయడంతో జైలు భద్రతా సిబ్బంది కాపాడారు. గాయపడిన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించి తిరిగి జైలుకు తీసుకొచ్చామని జైలు సూపరెంటెండెంట్ గౌరవ్ తెలిపారు. ఉగ్ర చర్యల్లో భాగంగా అతడు రిసిన్ నీటిలో కలపడానికి యత్నించాడనే అనుమానుంతో అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News March 21, 2026

రాజనగరం: రోడ్డు ప్రమాదంలో గాయపడింది వీరే..!

image

రాజానగరం ఏడీపీ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. విశాఖకు చెందిన కృష్ణమూర్తి, ఈశ్వరమ్మ, మనోహర్, కె. కృష్ణమూర్తి, లక్ష్మి, అఖిల కారులో వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తుండగా, మలుపు తిరుగుతున్న లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. క్షతగాత్రుల వివరాలను సీఐ వీరయ్యగౌడ్ మీడియాకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 21, 2026

MHBD: పురుగు మందు తాగిన బాలుడి మృతి

image

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పూసలతండకు చెందిన గుగులోత్ పవన్ పురుగు మందు తాగి మృతి చెందాడు. గుగులోత్ రాందాస్, స్వరూప కుమారుడైన పవన్(3వ తరగతి)స్కూలుకు వెళ్లడం లేదని తల్లి మందలించింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలుడు పురుగు మందు తాగాడు. రెండు రోజులు తర్వాత తన తల్లికి చెప్పడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందడంతో విషాధచాయలు అలముకున్నాయి.

News March 21, 2026

బాపట్ల: నాడు సినీ బౌన్సర్.. నేడు దొంగ

image

దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని చందోలు పోలీసులు అరెస్ట్ చేసినట్లు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో బాపట్ల DSP జగదీష్ నాయక్ వెల్లడించారు. పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెంలో సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఈనెల 7న దొంగతనం చేసిన నిందితుడు ఆటో దిగి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. అతను గతంలో సినీ ఫీల్డ్‌లో బౌన్సర్‌గా చేశాడన్నారు.