News November 19, 2025

HYD: జైలులో మొహియుద్దీన్‌పై దాడి

image

అహ్మదాబాద్ సబర్మతి జైలులో రాజేంద్రనగర్‌కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్‌పై దాడి జరిగింది. తోటి ఖైదీలే అతడిపై దాడి చేయడంతో జైలు భద్రతా సిబ్బంది కాపాడారు. గాయపడిన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించి తిరిగి జైలుకు తీసుకొచ్చామని జైలు సూపరెంటెండెంట్ గౌరవ్ తెలిపారు. ఉగ్ర చర్యల్లో భాగంగా అతడు రిసిన్ నీటిలో కలపడానికి యత్నించాడనే అనుమానుంతో అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News March 11, 2026

ఉమ్మడి వరంగల్‌లో రూ.20.16 కోట్లు సబ్సిడీ!

image

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి స్పందన లభిస్తోంది. గృహ విద్యుత్ సర్వీసులు 12.73లక్షలు ఉండగా రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు కోసం 9,058 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 2,939 ఇళ్లలో 9.95 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేశారు. అందులో 2,595 ఇన్‌స్టాలేషన్లకు రూ.20.16కోట్ల సబ్సిడీ విడుదలైంది. దీనిద్వారా విద్యుత్ వ్యయం తగ్గనుంది.

News March 11, 2026

నల్గొండ: మునిసిపల్ కౌన్సిల్ సమావేశాల ఊసేదీ?

image

జిల్లాలో కొత్త మున్సిపల్ కౌన్సిళ్లు ఏర్పడి రోజులు గడుస్తున్నా, ఇంతవరకు సమావేశాల ఊసే లేకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమోదానికి కేవలం 20 రోజుల గడువు మాత్రమే ఉండటంతో పాలనపై ప్రభావం పడే అవకాశం ఉంది. అధికారులు ప్రస్తుతం బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆమోదం పొందుతామని స్పష్టం చేశారు.

News March 11, 2026

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి మృతి

image

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు బుధవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ఆయన 1984,1989,1998లో మచిలీపట్నం నుంచి, 2004, 2009లో ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2013లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కావూరి మరణంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.