News November 19, 2025
HYD: నేడు PG, PhD రెండో విడత కౌన్సెలింగ్

రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ నేడు జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మ.3 గం.కు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 20, 2026
హామీలను అటకెక్కించిన బడ్జెట్: సీపీఎం

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టేలా ఉందని సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి విమర్శించారు. మొత్తం 3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌లో పేదలకు ఇచ్చిన ప్రధాన హామీలకు నిధుల కేటాయింపులు చేయకుండా ప్రభుత్వం వాటిని విస్మరించిందని మండిపడ్డారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కాలయాపన చేయడం సరికాదని ఆయన ధ్వజమెత్తారు.
News March 20, 2026
రేపు, ఎల్లుండి వర్షాలు: APSDMA

బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనంతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి విస్తరించి ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో శనివారం, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు అన్ని జిల్లాల్లో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని తెలిపిింది.
News March 20, 2026
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం SP

రంజాన్ సందర్భంగా ప్రకాశం జిల్లా ముస్లిం సోదరులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. పండగ సందర్భంగా మసీదులకు భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు.


