News November 19, 2025
HYD: నేడు PG, PhD రెండో విడత కౌన్సెలింగ్

రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ నేడు జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మ.3 గం.కు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 18, 2026
వైభవంగా రామయ్య నిత్య కళ్యాణ వేడుక

భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్య కళ్యాణ వేడుక కనులపండువగా జరిగింది. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించిన అనంతరం, ఉత్సవ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా విశ్వక్సేన పూజ, కంకణధారణ గావించి సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం వీక్షించి తరించారు.
News March 18, 2026
అరకు: రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం

అరకులోయలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఐటీఐ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్ పై సుమారు 30 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ట్రైన్ ఢీకొట్టడం వల్ల చనిపోయినట్లుగా స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 18, 2026
పాలమూరు: కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్‌కు గ్రీన్ సిగ్నల్..!

నల్లమల అడవుల్లో.. NH-167Kలో కల్వకుర్తి-నంద్యాల మధ్య కేబుల్ స్టే+సస్పెన్షన్ హైబ్రిడ్ స్టేజ్-1 ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చేసింది. 1,077 మీటర్ల ఐకానిక్ బ్రిడ్జ్‌కు సుమారు రూ.1,000-రూ.1,082 కోట్లు టెండర్ ఫ్లోట్ అయింది.. EPC బేసిస్‌పై 36 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. ఈ రహదారి గుండా వెళ్తే హైదరాబాద్-తిరుపతి దూరం 60 కి.మీ. తగ్గుతుంది. ఈ పనులు చేయుటకు త్వరలో టెండర్లు ఓపెన్ కానున్నట్లు సమాచారం.


