News November 19, 2025

కాంగ్రెస్ మేలుకోకపోతే కష్టం: ముంతాజ్

image

బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై INC దివంగత నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఘాటుగా స్పందించారు. ‘30ఏళ్ల కిందట మాదిరిగా ఇప్పుడు పనిచేయలేం. కొత్త ప్రభుత్వాలు, ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాం. సాకులు, నిందలు లేకుండా వాస్తవాలను అంగీకరించాలి. గ్రౌండ్ రియాల్టీ తెలియని కొద్దిమంది చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం అవడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయి. ఇకనైనా మేలుకొని మార్పులు చేయకపోతే కష్టం’ అని పేర్కొన్నారు.

Similar News

News March 24, 2026

IPL నుంచి తప్పుకున్న ENG బ్యాటర్!

image

IPL-2026 నుంచి ENG బ్యాటర్ బెన్ డకెట్(DC) తప్పుకున్నట్లు CricBuzz వెల్లడించింది. ఇంటర్నేషనల్ కెరీర్‌పై ఫోకస్ చేసేందుకు ఆయన IPLను స్కిప్ చేస్తున్నట్లు సమాచారం. BCCI రూల్ ప్రకారం ఆయనపై రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. ఆక్షన్‌లో ఎంపికైన తర్వాత టోర్నీ నుంచి తప్పుకునే ప్లేయర్లను బ్యాన్ చేయాలని గతేడాది కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. అటు CSKలోకి నాథన్ ఎల్లిస్ స్థానంలో AUS పేసర్ స్పెన్సర్ జాన్సన్ రానున్నారు.

News March 24, 2026

ఎనిమిదేళ్లు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటా: CM రేవంత్

image

TG: దేశ రాజకీయాల్లో తాను పని చేయాలనేది పార్టీయే నిర్ణయిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. ఇంకా ఎనిమిదేళ్లు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని టీవీ9 సమ్మిట్‌లో స్పష్టం చేశారు. రావణుడు ఉన్నాడు కాబట్టే రాముడు పేరు గడించారని, తెలంగాణలో ఉన్న విలన్ల వల్లే ప్రజలు తనను హీరో చేశారని పేర్కొన్నారు. 2034 వరకు రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ ఉంటానన్నారు. తాను నాయకుడిని కాదని, కార్యకర్తల స్నేహితుడినని చెప్పారు.

News March 24, 2026

యుద్ధం.. ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన తొలి దేశం

image

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఫిలిప్పీన్స్ ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రపంచంలో ఇలా ప్రకటించిన తొలి దేశంగా నిలిచింది. ఇంధన భద్రత, పెరుగుతున్న విద్యుత్ ధరల నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ తెలిపారు. ఎమర్జెన్సీ ఏడాదిపాటు కొనసాగే అవకాశం ఉంది. ఫిలిప్పీన్స్ దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌లో 98% పర్షియన్ గల్ఫ్ నుంచే వస్తుండటం గమనార్హం.