News November 19, 2025

రాబోయే రోజుల్లో HYD పరిస్థితి ఏంటి?

image

HYD మరో ఢిల్లీ కానుందా? ఈ పరిస్థితి అవుననేలా చేస్తోంది. నగరంలో దీపావళి నాడు ఏకంగా AQI 410కిపైగా నమోదైంది. దీంతో ప్రమాదపు డేంజర్ బెల్ రెడ్ సిగ్నల్ మోగించింది. దీనిని అంచనా వేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాబోయే రోజుల్లో మహానగర పొల్యూషన్ పెనుముప్పుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. కానీ.. గ్రౌండ్ లెవెల్లో పీసీబీ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Similar News

News March 14, 2026

10వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్?

image

AP: ఉగాది రోజున 60 విభాగాల్లో 10వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీలో భాగంగా 3,000కి పైగా టీచర్ పోస్టులు, 470 గ్రూప్-2, 101 గ్రూప్-1 పోస్టులు, వర్సిటీల్లో 1,500, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 1000 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. జాబ్ క్యాలెండర్‌లో మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయో మరో 2, 3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

News March 14, 2026

కర్నూలు జిల్లాలో ఒంటిపూట బడి.. టైమింగ్స్ ఇవే..!

image

ఈ నెల 16 నుంచి జిల్లా వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని కర్నూలు డీఈవో సుధాకర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్కూళ్లు ఉదయం 7:45 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12:30 గంటలకు ముగించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థికి భోజన వసతిని కల్పించాలన్నారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.

News March 14, 2026

NGKLలో నిప్పుల కొలిమి.. 39 డిగ్రీల ఉష్ణోగ్రత

image

నాగర్ కర్నూల్ జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కల్వకుర్తిలో 39.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాలైన శిరసనగండ్ల (38.9°C), వెల్టూర్, పెద్దకొత్తపల్లి (38.8°C)లలో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.