News November 19, 2025

ఐబొమ్మతో పైరసీ ఆగిపోతుందా?.. సీవీ ఆనంద్ రిప్లై ఇదే!

image

TG: కొందరిని అరెస్టు చేయగానే సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోవని హోంశాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అన్నారు. “ఐబొమ్మతో పైరసీ ఆగిపోతుందా?” అంటూ Xలో చేసిన పోస్టుపై ఆయన స్పందించారు. ‘ఒకడు పోతే మరొకడు వస్తాడు. ఈ నేరాలు కొనసాగుతూనే ఉంటాయి. మన చేతిలో ఉంది నివారణ ఒక్కటే. తక్షణమే డబ్బు సంపాదించాలన్న ఆశ తగ్గించుకోవాలి. సైబర్ నేరాలకు ఇదే మూల కారణం. రాజమౌళి చెప్పినట్లు జీవితంలో ఏదీ ఫ్రీగా రాదు’ అని పేర్కొన్నారు.

Similar News

News March 28, 2026

జాగృతిలో చేరికలు.. కండువా కప్పి ఆహ్వానించిన కవిత

image

తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు సంస్థలో చేరారు. నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సంస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News March 28, 2026

ఇరాన్‌తో యుద్ధం.. ట్రంప్‌కు అమెరికన్ల షాక్

image

యుద్ధోన్మాదంతో చెలరేగుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సొంత ప్రజల్లో ఆదరణ దారుణంగా పడిపోయింది. ఫాక్స్ న్యూస్ పోల్ సర్వేలో ఆయన తీరుపట్ల 59% మంది ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేయగా, వీరిలో 47% మంది తీవ్రంగా వ్యతిరేకించారు. 41% మంది మాత్రమే ఆయనను సమర్థించారు. అలాగే ట్రంప్ విదేశాంగ విధానాన్ని ఏకంగా 62% మంది, ఇరాన్‌తో ఘర్షణల విషయంలో ఆయన తీరును 64% మంది తప్పుపట్టారు.

News March 28, 2026

మెదడుకు విశ్రాంతినిచ్చే ‘బ్రెయిన్‌కేషన్’

image

ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత కోసం ‘బ్రెయిన్‌కేషన్’ అనే కొత్త ట్రెండ్ ప్రాచుర్యం పొందుతోంది. ఇది మెదడుకు ఇచ్చే చిన్న సెలవు లాంటిది. రోజువారీ డిజిటల్ ప్రపంచం, సోషల్ మీడియా, పని ఒత్తిడి నుంచి పూర్తిగా దూరంగా ఉంటూ.. ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండడమే దీని ఉద్దేశం. ఫోన్‌ను పక్కన పెట్టడమే కాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మనసుకు నచ్చినట్లు గడపాలి. దీన్నే ‘బ్రెయిన్‌కేషన్’ అంటారు.